పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

 •  
 •  
 •  

6-440-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఖిల దుఃఖైక సంహారాది కారణం-
ఖిలార్థ సంచ యాహ్లాదకరము
విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం-
నుపమ భక్త వర్ణనరతంబు
విబుధహర్షానేక విజయ సంయుక్తంబు-
గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు
బ్రహ్మహత్యానేక పాపనిస్తరణంబు-
మనీయ సజ్జన కాంక్షితంబు

6-440.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నైన యీ యితిహాసంబు ధిక భక్తి
వినినఁ జదివిన వ్రాసిన నుదినంబు
నాయు రారోగ్య విజయ భాగ్యాభివృద్ధి
ర్మనాశము సుగతియుఁ ల్గు ననఘ! "

టీకా:

అఖిల = సమసమైన; దుఃఖ = దుఃఖములు; ఏక = అన్నిటిని; సంహార = నాశనము చేయుట; ఆది = మొదలగు; కారణంబు = కారణమైనది; అఖిల = సర్వమైన; అర్థ = ప్రయోజనముల; సంచయ = సమూహమునకు; ఆహ్లాద = సంతోషమును; కరము = కలిగించునది; విమల = స్వచ్ఛమైన; భక్త = భక్తుల; ఉద్రేక = అతిశయించిన; విభవ = వైభవమును; సందర్శనంబు = దర్శింపజేయునది; అనుపమ = సాటిలేనిది; భక్త = భక్తుల; వర్ణన = కీర్తించుటందు; రతంబు = ఆసక్తి గలది; విబుధ = దేవతలకు; హర్ష = సంతోషమును కలిగించి; అనేక = అనేకమైన; విజయ = విజయములతో; సంయుక్తంబు = కూడినది; గ్రస్తా = మింగబడినను; అమరేంద్ర = ఇంద్రుని; మోక్ష = విముక్తికి; క్రమంబు = కారణము; బ్రహ్మహత్యా = బ్రహ్మహత్యాదోషము; అనేక = మొదలగు; పాప = పాపములను; నిస్తరణంబు = తరింపజేయునది; కమనీయ = కోరదగినట్టి; సజ్జన = మంచివారిచేత; కాంక్షితంబున్ = కోరబడునది; ఐన = అయిన;
ఈ = ఈ; ఇతిహాసంబున్ = ఇతిహాసమును; అధిక = అధికమైన; భక్తిన్ = భక్తితో; వినినన్ = వినినప్పటికిని; చదివినన్ = చదివినప్పటికిని; వ్రాసినన్ = వ్రాసినప్పటికిని; అనుదినంబు = ప్రతిదినము; ఆయుష్ = జీవితకాలము; ఆరోగ్య = ఆరోగ్యము; విజయ = విజయములు; భాగ్య = భాగ్యముల; అభివృద్ధి = అభివృద్ధి; కర్మ = పూర్వకర్మపలముల; నాశమున్ = నాశనము; సుగతి = ముక్తిపథము; కల్గును = కలుగును; అనఘ = పుణ్యుడా.

భావము:

ఓ పుణ్యాత్మా! వృత్రాసుర సంహారమనే ఈ ఇతిహాసం సమస్త దుఃఖాలను శమింప జేస్తుంది. కోరిన కోరిక లన్నింటినీ సమకూరుస్తుంది. అచంచలమైన భక్తిని అతిశయింప జేస్తుంది. మహా భక్తుల యందు ఆసక్తిని కలిగిస్తుంది. దేవతలందరికీ ఆనందాన్ని అందిస్తుంది. విజయాలను చేకూరుస్తుంది. బ్రహ్మహత్య మొదలైన పాపాలను సైతం పోగొడుతుంది. సత్పురుషులకు సర్వదా కాంక్షింప దగినట్టిది. శాపగ్రస్తుడైన ఇంద్రునికి సైతం విముక్తిని ప్రసాదించినట్టిది. ఇటువంటి ఇతిహాసాన్ని భక్తి పూర్వకంగా ప్రతిదినమూ పఠించినా, విన్నా, వ్రాసినా ఆయురారోగ్యాలు లభిస్తాయి. భోగ భాగ్యాలు ప్రాప్తిస్తాయి. విజయశ్రీ వరిస్తుంది. కర్మక్షయమై మోక్షాన్ని చేకూరుతుంది.”