పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-439-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱియుఁ బుట్టింపంగ నసు పెట్టిన యట్టి-
క్రూరకర్మాంబోధి కుంభజుండు
అంగారములు చేయ నాహుతిఁ గన నోపు-
హు పాపకానన పావకుండు
కందక దిగ మ్రింగి ఱ్ఱునఁద్రేపంగఁ-
ల్మషగరళ గంగాధరుండు
నగుహాంతరములఁ గాలూన నియ్యని-
లుష దుస్తర తమో గ్రహ విధుండు

6-439.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కల ముక్తిలోక సామ్రాజ్య సమధిక
హజ భోగ భాగ్య సంగ్రహైక
కారణాప్రమేయ కంజాక్ష సర్వేశ
కేశవాది నామ కీర్తనంబు.

టీకా:

మఱియున్ = ఇంకను; పుట్టింపంగన్ = పునర్జన్మము కలుగునట్లు; మనసుపెట్టిన = తలపెట్టిన; అట్టి = అటువంటి; క్రూర = క్రూరమైన; కర్మ = కర్మములు యనెడి; అంబోధి = సముద్రమునకు {అంబోధి - అంబు (నీటికి) నిధి, సముద్రము}; కుంభజుండు = అగస్త్య మహర్షి {కుంభజుండు - కుంభము నందు జుడు (పుట్టినవాడు), అగస్త్యుడు}; అంగారములు = బొగ్గులు; చేయన్ = చేయుటకు; ఆహుతి = కాల్చుట; కననోపుడు = చేయ సమర్థుడు; బహు = అనేకమైన; పాప = పాపములు యనెడి; కానన = అడవులకు; పావకుండు = అగ్నిహోత్రుడు; కందక = కందిపోకుండగ; దిగమ్రింగి = మింగేసి; గఱ్ఱున = గర్రుమని; త్రేపంగన్ = తేన్చ గలుగుటలో; కల్మష = పాపములు యనెడి; గరళ = విషమునకు; గంగాధరుండు = పరమశివుడు; ఘన = గొప్ప; గుహా = గుహల; అంతరములన్ = లోపల; కాలూననియ్యని = కాలుపెట్టనివ్వని; కలుష = పాపములు యనెడి; దుస్తర = దాటరాని; తమః = చీకటిని; గ్రహ = తాగివేయుటలో; విధుండు = చంద్రుడు;
సకల = సమస్తమైన; ముక్తి = మోక్షముల; లోక = సర్వముయైన; సామ్రాజ్య = సామ్రాజ్యముయొక్క; సమధిక = మిక్కిలి అధికమైన; సహజ = సహజమైన; భోగ = భోగములు; భాగ్య = భాగ్యముల; సంగ్రహ = స్వీకరించుట; ఏక = ముఖ్యమైన; కారణ = కారణమైన; అప్రమేయ = విష్ణుమూర్తి; కంజాక్ష = విష్ణుమూర్తి; సర్వేశ = విష్ణుమూర్తి; కేశవ = విష్ణుమూర్తి; ఆది = మొదలగు; నామ = పేర్లుతో; కీర్తనంబు = స్తుతించుట.

భావము:

పునర్జన్మకు కారణాలైన క్రూరకృత్యా లనబడే సముద్రాన్ని త్రాగిన అగస్త్యుని వంటివాడు. మహా పాతకా లనబడే అరణ్యాలను భస్మం చేసే అగ్నిహోతుని వంటివాడు. భక్త జనుల కల్మషా లనబడే కాలకూటాన్ని అలవోకగా మ్రింగే పరమశివుని వంటివాడు. అంతులేని కలుష రాసు లనబడే కటిక చీకట్లను పటాపంచలు చేసే సూర్యుని వంటివాడు. ఆ నారాయణునికి గల కమలాక్షుడు, సర్వేశ్వరుడు, కేశవుడు మొదలైన నామాల సంకీర్తనం సమస్తమైన మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించి పెట్టి సకల భోగభాగ్యాలను సమకూరుస్తుంది.