పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-436.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నా గుణంబు లెల్ల భోగింప కేరీతి
రుగ నెంతవాఁడ" నెడుదాని
బిట్టు దిరిగి చూచి భీతిల్లి సిగ్గుతో
దేవనాయకుండు దెరలి పఱచె.

టీకా:

పాపంబున్ = పాపమును; చండాల = మిక్కిలి చెడ్డది యైన; రూపంబున్ = స్వరూపము; కల = ఉన్న; దానిన్ = దానిని; ముదిమి = ముసలితనముచేత; ఒడలు = ఒళ్ళు; ఎల్లన్ = అంతయు; కదలు = కదిలిపోతున్న; దానిన్ = దానిని; క్షయ = క్షయ; కుష్ఠు = కుష్ఠు; రోగ = రోగముల; సంచయ = సమూహములచే; కృతంబు = చేయబడినది; అగు = అయిన; దానిన్ = దానిని; ఉరు = అధికమైన; రక్త = రక్తపు; పూరంబున్ = ప్రవాహములు; తొరగు = స్రవించు; దానిన్ = దానిని; అరసిన = చూడగా; వెండ్రుకల్ = వెంట్రుకలు; నెరసిన = నెరిసిపోయిన; తల = తల గల; దానిన్ = దానిని; అటన్ = అక్కడకు; పోకుపోకుండుము = వెళ్ళనే వెళ్ళవద్దు; అనెడు = చెప్పెడు; దానిన్ = దానిని; కదురు = విజృంభించిన కంపునన్ = చెడువాసన వలన; ప్రేవులన్ = పేగులను; అదరజేసెడు = అదరగొట్టెడు; దానిన్ = దానిని; తాన్ = తను; ఎందున్ = ఎక్కడకు; పాఱినన్ = పారిపోయినను; తఱుము = వెంటపడు; దానిన్ = దానిని;
నా = నా యొక్క; గుణంబులు = లక్షణములు; ఎల్లన్ = అన్నిటిని; భోగింపక = అనుభవింపకుండగా; ఏ = ఏ; రీతిన్ = విధముగ; అరుగన్ = పోవుటకు; ఎంతవాడవు = సమర్థుడవు కావు; అనెడు = అనెడి; దానిన్ = దానిని బిట్టు = మిక్కిలి; తిరిగి = వెనుదిరిగి; చూచి = చూసి; భీతిల్లి = భయపడిపోయి; సిగ్గు = బిడియము; తోన్ = తోటి; దేవనాయకుండు = ఇంద్రుడు {దేవనాయకుడు - దేవతలకు నాయకుడు, ఇంద్రుడు}; తెరలి = కళవళపడి; పఱచె = పరిగెట్టెను.

భావము:

బ్రహ్మహత్యా పాపం చండాలరూపాన్ని ధరించి ముసలితనంతో ఒడలంతా ముడతలు పడి గడగడ వణుకుతూ నడచి వచ్చింది. క్షయరోగంతో, కుష్ఠురోగంతో దాని శరీరమంతా నెత్తురులు చిమ్ముతున్నవి. నెరసిన జుట్టు విరబోసుకొని “పోకు! ఉండు” అంటూ ఉన్నది. దేహమంతా దుర్గంధంతో డోకు వచ్చి ప్రేగులు తరుక్కుపోయేట్లు కంపు కొడుతున్నది. ఇంద్రుడు ఎటు పోతే అటు పరిగెత్తి వెంటబడి తరుముతున్నది. “నా గుణాలను అనుభవించకుండా ఎట్లా పోతావు? నాముందు నీవెంతవాడవు?” అంటున్నది. వెంట పరుగిడి వస్తున్న బ్రహ్మహత్యను తిరిగి తిరిగి చూస్తూ ఇంద్రుడు భయంతో, సిగ్గుతో పారిపోసాగాడు.