పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-432-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మి చెప్ప నప్పు డింద్రారి తనువున
నొక్క దివ్యతేజ ముబ్బి వెడలి
లోకమెల్లఁ జూడ లోకులు చూడని
లోక మరసి విష్ణులోను చొచ్చె.

టీకా:

ఏమిచెప్పన్ = విచిత్రముగ; అప్పుడు = అప్పుడు; ఇంద్రారి = వృత్రుని {ఇంద్రారి - ఇంద్రుని అరి (శత్రువు), వృత్రుడు}; తనువునన్ = దేహమునుండి; ఒక్క = ఒక; దివ్య = దివ్యమైన; తేజము = తేజస్సు; ఉబ్బి = వెలువడి; వెడలి = వెళ్ళి; లోకము = లోకము; ఎల్లన్ = అంతయు; చూడన్ = చూచుచుండగా; లోకులు = ప్రజలు; చూడని = చూడనట్టి; లోకమున్ = లోకమును; అరసి = కనుగొని; విష్ణు = విష్ణుమూర్తి; లోనున్ = అందు; చొచ్చె = లయమయినది.

భావము:

ఏమని చెప్పను? ఆ సమయంలో వృత్రాసురుని శరీరంలోనుండి ఒకానొక దివ్య తేజస్సు వెలువడి జనులందరూ చూస్తుండగా ఈ లోకంలో నుండి విష్ణులోకానికి వెళ్ళి విష్ణువులో లీనమయింది.