పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-431-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మొసెన్ దుందుభు లంబరంబునఁ గడున్ మోదించి గంధర్వులున్
సులున్ సాధ్యులు సిద్ధులున్ మునివరుల్ సొంపార వృత్రఘ్ను భీ
తేజోవిభవప్రకాశకర విఖ్యాతైఁక మంత్రంబులం
ది మొప్పం బఠియించుచుం గురిసి రెంతేఁ గ్రొత్త పూ సోనలన్.

టీకా:

మొరసెన్ = మోగినవి; దుందుభులు = భేరీలు; అంబరంబునన్ = ఆకాశమున; కడున్ = మిక్కిలి; మోదించి = సంతోషము కలిగించి; గంధర్వులున్ = గంధర్వులు; సురలున్ = దేవతలు; సాధ్యులున్ = సాధ్యులు; సిద్ధులున్ = సిద్ధులు; ముని = మునులలో; వరుల్ = ఉత్తములు; సొంపార = చక్కగా; వృత్రఘ్నున్ = ఇంద్రుని; భీకర = భయంకరమైన; తేజస్ = తేజస్సు యొక్క; విభవ = వైభవమును; ప్రకాశకర = వెల్లడి చేసెడి; విఖ్యాత = ప్రసిద్ధమైన; ఏఁక = మిక్కిలి ఆపేక్షకలిగిన; మంత్రంబులన్ = మంత్రములతో; తిరము = కుదురుగా; ఒప్పన్ = చక్కగా; పఠియించుచున్ = చదువుతూ; కురిసిరి = కురిపించిరి; ఎంతేన్ = అధికముగా; క్రొత్త = సరికొత్త; పూ = పూవుల; సోనలన్ = వర్షములను.

భావము:

ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి. గంధర్వులు, దేవతలు, సాధ్యులు, సిద్ధులు, మునీంద్రులు మిక్కిలి ఆనందించి వృత్రాసురుని సంహరించిన ఇంద్రుని తేజో వైభవాన్ని ప్రకాశింప జేసే ప్రశస్తమైన మంత్రాలను పఠిస్తూ పూలవానలు కురిపించారు.