పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-429-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కందఁడు భీతి గుందఁడు ప్రకంపనమొందఁడు పెద్దనిద్దురం
జెందఁడు తత్తఱింపఁడు విశేషముఁ జొప్పఁడు వైష్ణవీ జయా
నంపరైక విద్యను మనంబునఁ దాల్చుచు నుండెఁ గాని సం
క్రంనుఁడా నిశాచరుని ర్భములో హరిరక్షితాంగుఁడై.

టీకా:

కందడు = కదిపోడు; భీతిన్ = భయముతో; కుందడు = కుంగిపోడు; ప్రకంపనము = వణుకు; అందడు = పొందడు; పెద్దనిద్దురన్ = మరణమును; చెందడు = పొందడు; తత్తఱింపడు = కళవళపడడు; విశేషమున్ = విశిష్టితలను; చొప్పడు = కలిగించెడి; వైష్ణవీ = విష్ణుమూర్తి యొక్క; జయ = జయమును; ఆనంద = ఆనందమును; పర = లక్షించెడి; ఏక = ముఖ్యమైన; విద్యను = విద్యను; మనంబునన్ = మనసు నందు; తాల్చుచుచున్ = ధరించుచు; ఉండెన్ = ఉండెను; కాని = అంతే తప్ప; సంక్రందనుడు = ఇంద్రుడు {సంక్రందనుడు – శత్రువును ఆక్రందనము (మొఱ) పెట్టించు వాడు, దేవేంద్రుడు}; ఆ = ఆ; నిశాచరుని = రాక్షసుని {నిశాచరుడు - నిశ (రాత్రులు) యందు చరుడు (చరించెడివాడు), రాక్షసుడు}; గర్భము = కడుపు; లో = అందు; హరి = నారాయణునిచే; రక్షిత = కాపాడబడిన; అంగుడు = దేహము గలవాడు; ఐ = అయ్యి.

భావము:

వృత్రాసురుని కడుపులోని ఇంద్రుడు కసుగందలేదు. భయపడలేదు. వణికిపోలేదు. ప్రాణాలు కోల్పోలేదు. తత్తర పడలేదు. ఆనందమయమైన వైష్ణవీ విద్యను మనస్సులో ధ్యానిస్తూ శ్రీహరి వల్ల రక్షణ పొంది చెక్కు చెదరక నిశ్చలంగా నిర్భయంగా ఉన్నాడు.