పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-427-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లో మెల్ల నపుడు చీఁకాకు పడెఁ దమం
డరె నుడుగణంబు వనిఁ బడియె;
సోనవాన గురిసె సూర్యచంద్రాగ్నుల
శ్ము లడఁగె దిశలు భస మయ్యె.

టీకా:

లోకముల్ = లోకములు; ఎల్లన్ = అన్నియును; అపుడు = అప్పుడు; చీకాకుపడెన్ = చీకాకుపడెను; తమంబు = చిమ్మచీకట్లు; అడరెన్ = అతిశయించెను; ఉడు = నక్షత్రముల; గణంబుల్ = సమూహములు; అవనిన్ = భూమిపై; బడియె = పడెను సోనవాన = జడివాన; కురిసెన్ = కురిసెను; సూర్య = సూర్యుడు; చంద్ర = చంద్రుడు; అగ్నుల = అగ్నుల యొక్క; రశ్ములన్ = కాంతులు; అడగెన్ = అణగిపోయెను; దిశలు = దిక్కు లందు; రభసము = చీకాకు; అయ్యెన్ = కలిగెను.

భావము:

లోకమంతా చీకాకు పడింది. అంతటా చిమ్మచీకట్లు క్రమ్ముకున్నాయి. నక్షత్రాలు నేల రాలాయి. రక్తవర్షం కురిసింది. సూర్యచంద్రాగ్నులు తేజస్సులు కోల్పోయారు. దిక్కులు తారుమారైనాయి.