పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-420-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు కరకలిత వజ్రాయుధ రుఙ్మండల మండిత దిఙ్మండలుం డైన జంభారి గంభీర వాక్యంబుల విస్మయ మందస్మిత ముఖారవిందుం డయి వృత్రున కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కర = చేతిలో; కలిత = కలిగిన; వజ్రాయుధ = వజ్రాయుధము యొక్క; రుక్ = ప్రకాశపు; మండల = వలయములచే; మండిత = అలంకరింపబడిన; దిఙ్మండలుండు = పరిసరములు గలవాడు; ఐన = అయిన; జంభారి = ఇంద్రుడు {జంభారి - జంభాసురుని అరి (శత్రువు), ఇంద్రుడు}; గంభీర = గంభీరమైన; వాక్యంబులన్ = పలుకులతో; విస్మయ = ఆశ్చర్యకరమైన; మందస్మిత = చిరునవ్వుతో కూడిన; ముఖ = ముఖము యనెడి; అరవిందుండు = పద్మము గలవాడు; అయి = అయ్యి; వృత్రున్ = వృత్రున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా తన చేతిలోని వజ్రాయుధ కాంతులు దిక్కుల నిండా వెలుగులు వెదజల్లుతూ ఉండగా ఇంద్రుడు ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు చిందే ముఖంతో వృత్రాసురుని చూచి గంభీరంగా ఇలా అన్నాడు.