పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-418-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వుడు వృత్రుమాటలకు ద్భుత మంది సురేంద్రుఁ డెంతయుం
మదిఁ గుత్సితం బుడిగి దైవముగా నతనిన్ భజించి కై
కొనియెఁ గరంబునన్ దిగువఁ గూలిన వజ్రము, నప్పు డాత్మలోఁ
రె జగంబు లన్నియు ముదంబునఁ బొందిరి ఖేచరావళుల్.

టీకా:

అనవుడు = అనగా; వృత్రు = వృత్రుని; మాటల్ = పలుకుల; కున్ = కు; అద్భుతము = ఆశ్చర్యమును; అంది = పొంది; సురేంద్రుడు = దేవేంద్రుడు; ఎంతయున్ = ఎంతగానో; తన = తన యొక్క; మదిన్ = మనసునందు; కుత్సితంబు = కుటిలత్వమును; ఉడిగి = వదలి; దైవముగా = దేమునిగా; అతనిన్ = అతనిని; భజించి = పూజించి; కైకొనియెన్ = తీసుకొనెను; కరంబునన్ = చేతిలోనికి; దిగువన్ = కింద; కూలిన = పడిపోయిన; వజ్రమున్ = వజ్రాయుధమును; అప్పుడు = అప్పుడు; ఆత్మ = మనసు; లోన్ = అందు; తనరెన్ = అతిశయించినవి; జగంబులు = లోకములు; అన్నియున్ = సర్వము; ముదంబునన్ = సంతోషమును; పొందిరి = పొందిరి; ఖేచర = దేవతల {ఖేచరులు - ఖః (ఆకాశమున) చరులు (సంచరించెడివారు), దేవతలు}; ఆవళుల్ = సమూహములు.

భావము:

ఆ వృత్రాసురుని మాటలకు ఇంద్రుడు మిక్కిలి ఆశ్చర్య చకితుడైనాడు. అతని మనస్సులోని మాత్సర్యం మాయమయింది. అతనికి వృత్రాసురుడు భగవంతుడుగా కనిపించాడు. ఇంద్రుడు వంగి నేలపై పడి ఉన్న వజ్రాయుధాన్ని మళ్ళీ అందుకున్నాడు. అది చూచి లోకాలన్నీ ఆనందించాయి. దేవతలు సంతోషించారు.