పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-417-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వాహనంబులు సారెలు వాఁడిశరము
లూర్జి తాక్షము లసువులె యొడ్డణములు
గాఁగఁ బోరెఁడు నీ ద్యూతర్మమందు
నెసఁగ జయమును నపజయ మెవ్వఁ డెఱుఁగు? "

టీకా:

వాహనంబులున్ = వాహనములు; సారెలు = పాచికలు; వాడి = పదునైన; శరములు = బాణములు; ఊర్జిత = దృఢమైన; అక్షములు = వ్యవహారములు; అసువులె = ప్రాణములే; ఒడ్డణములు = ఒడ్డెడి పందెములు; కాగన్ = అగునట్లు; పోరెడు = యుద్ధముచేసెడి; ఈ = ఈ; ద్యూతకర్మము = జూదము; అందున్ = లో; ఎసగన్ = అతిశయించి; జయమునున్ = విజయము; అపజయమున్ = అపజయములు; ఎవ్వడు = ఎవడు మాత్రము; ఎఱుగు = తెలియగలడు.

భావము:

“వాహనాలే ఆటబల్లలు, వాడి బాణాలే పాచికలు, ప్రాణాలే పందాలు అయిన ఈ యుద్ధమనే జూదంలో జయాపజయాలు ఎవరివో ఎవరికి తెలుసు?”