పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-414-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జ్రంబుఁ గైకొని వైరి నిర్జింపు; మి-
ట్లడలంగ వేళ గా మరనాథ!
మర దేహాధీను లైన మూర్తుల కెల్ల-
నీశు లక్ష్మీశు సర్వేశుఁ బాసి
డతేఱ జయములు ల్గునె యెందైనఁ?-
లపోసి చూడుమా; త్త్వబుద్ధి
నీ లోకపాలకు లెవ్వని వశగతి-
లఁ బడ్డ పక్షుల ర్తనమునఁ

6-414.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జిక్కి చేష్టలు చేయుచుఁ జింతగాంతు
ట్టి మృత్యు బలంబుల నాత్మజయము
మదిగాఁ గోరి యజ్ఞాన తంత్రు లగుచుఁ
మలలోచను లీలా వికారములను.

టీకా:

వజ్రంబున్ = వజ్రాయుధమును; కైకొని = చేపట్టి; వైరిన్ = శత్రువును; నిర్జింపుము = సంహరించుము; ఇట్లు = ఈ విధముగ; అడలంగన్ = భీతిచెందుటకు; వేళ = సరియగు సమయము; కాదు = కాదు; అమరనాథ = ఇంద్రుడా {అమరనాథుడు - అమర (దేవతలకు) నాథుడు (ప్రభువు), ఇంద్రుడు}; అమరన్ = అమరిన, సిద్దించిన; దేహ = శరీరములపై; అధీనులు = ఆధారపడెడివారు; ఐన = అయిన; మూర్తుల్ = వ్యక్తుల; కున్ = కి; ఎల్లన్ = అందరకును; ఈశున్ = హరిని {ఈశుడు - ప్రభువు, విష్ణువు}; లక్ష్మీశున్ = హరిని {లక్ష్మీశుడు - లక్ష్మీదేవి యొక్క ఈశుడు (ప్రభువు), విష్ణువు}; సర్వేశున్ = హరిని {సర్వేశుడు - సర్వుల(అందరి)కి ఈశుడు (ప్రభువు), విష్ణువు}; పాసి = దూరమై; కడతేఱన్ = చనిపోయినచో; జయముల్ = విజయములు; కల్గునే = లభించునా ఏమి; ఎందైనన్ = ఎక్కడైనను; తలపోసి = ఆలోచించి; చూడుమా = చూడుము; తత్త్వ = సత్యమైనట్టి; బుద్దిన్ = బుద్ధితో; ఈ = ఈ; లోక = లోకములను; పాలకుల్ = పరిపాలకులు; ఎవ్వని = ఎవని యొక్క; వశగతి = వశవర్తులై; వలన్ = వలలో; పడ్డ = పడిన; పక్షుల = పక్షుల యొక్క; వర్తనమున = విధముగ; చిక్కి = తగుల్కొని;
చేష్టలు = చేష్టలు; చేయుచున్ = చేయుచు; చింతన్ = బాధలను; కాంతురు = పొందెదరు; అట్టి = అటువంటి; మృత్యు = మృత్యువు యొక్క; బలంబులన్ = శక్తిని; ఆత్మ = తమ యొక్క; జయమున్ = విజయములను; తమదిగాన్ = తమ సమర్థతగా; కోరి = అనుకొని; అజ్ఞాన = అజ్ఞానమునకు; తంత్రులు = లోబడినవారు; అగుచున్ = అగుచు; కమలలోచను = నారాయణుని; లీలా = క్రీడల యొక్క; వికారములను = ప్రభావముల వలన.

భావము:

ఇంద్రా! వజ్రాన్ని అందుకొని శత్రువును ఓడించు. ఈ విధంగా చింతించడానికి ఇది సమయం కాదు. శరీరధారులైన జీవులు సమస్త భువనాధీశ్వరుడైన శ్రీమహావిష్ణువును కాదని స్వతంత్రించి మిట్టిపడితే జయాన్ని పొందలేరు. నీవే ఆలోచించు. సత్యాన్ని గ్రహించు. ఈ లోకపాలకులందరూ ఆ పరాత్పరునికి లోబడి వలలో చిక్కిన పక్షుల వలె వర్తిస్తున్నారు. చెప్పినట్లు చేస్తున్నారు. సుఖ దుఃఖాలను, మృత్యుభయాన్నీ అనుభవిస్తున్నారు. ఇదంతా ఆ శ్రీహరి లీలావిలాసమన్న సంగతి మరిచిపోయి తమకు ప్రాప్తించిన విజయానికి తామే కారణ మనుకొని విఱ్ఱవీగుతూ అజ్ఞానంలో మునిగి తేలుతున్నారు.