పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-413-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"దుమునఁ గైదువు వదలిన
ణన్నను వైరిజనులఁ జంపరు వీరుల్
వెఱఁగంద నేల? కులిశము
మరుదుగఁ బుచ్చికొనుము కాచితి నింద్రా!

టీకా:

దురమునన్ = యుద్ధము నందు; కైదువ = ఆయుధము; వదలిన = పడవేసిన; శరణు = కాపాడు; అన్ననున్ = అనినను; వైరి = శత్రువులైన; జనులను = వారిని; చంపరు = సంహరింపరు; వీరుల్ = వీరులైనవారు; వెఱగు = భయము; అందన్ = పడుట; ఏలన్ = ఎందులకు; కులిశమున్ = వజ్రాయుధమును; కరమున్ = మిక్కిలి; అరుదుగ = అద్భుతముగ; పుచ్చికొనుము = తీసుకొనుము; కాచితిన్ = ఆగితిని; ఇంద్రా = ఇంద్రుడా.

భావము:

“ఇంద్రా! రణరంగంలో ఆయుధం విడిచి ఉన్నప్పుడు, శరణు కోరినప్పుడు వీరులైనవారు శత్రువును వధింపరు. నీకు అభయ మిస్తున్నాను. భయపడకు. నీ ఆయుధాన్ని నీవు తీసుకో.