పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-412-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు యుద్ధంబున శత్రు సన్నిధిం గరంబు జాఱిపడిన వజ్రంబుఁ బుచ్చికొనక నివ్వెఱపడి, లజ్జించి యున్న పాకశాసనుం జూచి వృత్రుం డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; యుద్ధంబునన్ = యుద్ధము నందు; శత్రు = శత్రువు; సన్నిధిన్ = సమీపములో; కరంబున్ = మిక్కిలి; జాఱిపడిన = జారిపడిపోయిన; వజ్రంబున్ = వజ్రాయుధమును; పుచ్చికొనక = తీసుకొనకుండ; నివ్వెఱబడి = నిశ్చేష్టుడై; లజ్జించి = సిగ్గుపడి; ఉన్న = ఉన్నట్టి; పాకశాసనున్ = ఇంద్రుని; చూచి = చూసి; వృత్రుండు = వృత్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా యుద్ధభూమిలో శత్రువు ముందు చేజారి క్రిందపడిన తన వజ్రాయుధాన్ని తిరిగి అందుకోకుండా నివ్వెరపాటుతో, సిగ్గుతో ఉన్న ఇంద్రుని చూచి వృత్రాసురుడు ఇలా అన్నాడు.