పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-409-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుడుఁడు పొదవిన నాగము
ణిన్ వృత్రాసురేంద్రు డిమికి లోనై
తిరుగుడు పడ్డ హరిం గని
పుపుర నాహా! యటంచుఁ బొగిలె జగంబుల్.

టీకా:

గరుడుడు = గరుత్మంతుడు; పొదవిన = పొదవిపట్టుకొన్న; నాగము = పాము; కరణిన్ = వలె; వృత్రా = వృత్రుడు యనెడి; అసుర = రాక్షసులలో; ఇంద్రు = శ్రేష్ఠుని; కడిమి = సామర్థ్యమున; కిన్ = కి; లోనై = లొంగిపోయి; తిరుగుడుపడ్డ = తిరగబడిపోయిన; హరిన్ = ఇంద్రుని; కని = చూసి; పురపురన్ = పురపుర అని ఆపేక్షపడి; ఆహా = ఆహా; అటంచున్ = అనుచు; పొగిలెన్ = కుమిలిపోయినవి; జగంబుల్ = లోకములు.

భావము:

గరుత్మంతుడు పట్టుకున్న కాలసర్పం వలె వృత్రాసురుని పరాక్రమానికి లోబడిన ఇంద్రుని చూచి లోకాలన్నీ “అయ్యో” అని కుమిలిపోయాయి.