పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-408-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ము మద ముడిగి తిరుగుచు
గుగుజనై గీఁకపెట్టఁ గులిశము నేలన్
న చెడి విడిచె నింద్రుఁడు
జిబిజితో బెగడె నసుర డిమి జగంబుల్.

టీకా:

గజము = ఏనుగు; మదము = మదము; ఉడిగి = జారి; తిరుగుచున్ = గుండ్రముగ తిరుగుతూ; గుజగుజన్ = పీడితము; ఐ = అయ్యి; గీకపెట్టన్ = బాధతో కేక పెట్టగ {గీక - ఏనుగు యొక్క అరుపు, ఘీంకారము}; కులిశము = వజ్రాయుధము; నేలన్ = భూమిపైన; భజనచెడి = వశముతప్పి, పట్టుతప్పి; విడిచెన్ = పడవేసెను; ఇంద్రుడు = ఇంద్రుడు; గజిబిజి = కలత; తోన్ = తోటి; బెగడెన్ = అల్లాడెను; అసుర = రాక్షసులు; కడిమి = తప్పించి ఇతరమైన; జగంబుల్ = లోకములు.

భావము:

ఇనుప గుదియ దెబ్బకు ఇంద్రుని ఐరావతం మదమణగి గుండ్రంగా తిరుగుతూ తల్లడిల్లి గీ పెట్టింది. ఇంద్రుడు సొమ్మసిల్లి వజ్రాయుధాన్ని జార విడిచాడు. వృత్రాసురుని పరాక్రమానికి రాక్షసులు తప్ప మిగిలిన జగాలు అల్లాడిపోయాయి.