పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-407-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు ప్రళయకాల భీషణ పరివేష పోషంబుగా రోషంబునం బరిఘంబుఁ ద్రిప్పి కుప్పించి గజ కుంభస్థలంబు భగ్నంబు చేసి యింద్రు హనుప్రదేశంబును నిష్ఠురాహతి నొప్పించిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ప్రళయకాల = ప్రళయకాలపు; భీషణ = భయంకరమైన; పరివేష = సూర్యునిచుట్టు కట్టెడి గుడిని; పోషకంబుగా = విస్తరింపజేయునదిగా; రోషంబునన్ = కోపముతో; పరిఘంబున్ = గొలుసుల గుదియను; త్రిప్పి = తిప్పి; కుప్పించి = గెంతి; గజ = ఐరావతము యొక్క; కుంభస్థలంబు = కుంభస్థలమును; భగ్నంబుచేసి = బద్దలుకొట్టి; ఇంద్రు = ఇంద్రుని; హనుప్రదేశంబునున్ = చెక్కిలిపైభాగమును; నిష్ఠుర = గట్టి; ఆహతిన్ = దెబ్బతో; నొప్పించినన్ = కొట్టగా.

భావము:

ఈ విధంగా ప్రళయకాలంలో సూర్యమండలాన్ని చుట్టుకొని ఉన్న పరివేషం వలె ఇనుప గుదియను గిరగిర త్రిప్పుతూ దూకి ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టు పెట్టి ఇంద్రుని దవడ మీద పెద్దగా కొట్టి నొప్పించగా...