పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-406-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శూల మప్పు డతఁడు స్రుక్కక ఖండించి
పూని తోన కదిసి భుజము ద్రుంచె;
సుర గనలి యేకస్తుఁడై పరిఘంబు
గొని మహేంద్రుఁ గిట్టి నువు లడిచె.

టీకా:

శూలమున్ = శూలమును; అప్పుడు = అప్పుడు; అతడు = అతడు; స్రుక్కక = వెనుదీయక; ఖండించి = ముక్కలుచేసి; పూనిన్ = పూనిక; తోన = తోటి; కదిసి = సమీపించి; భుజమున్ = భుజమును; త్రుంచెన్ = ఖండించెను; అసుర = రాక్షసుడు; కనలి = కోపగించి; ఏక = ఒకటే; హస్తుడు = చేయి గలవాడు; ఐ = అయ్యి; పరిఘంబున్ = పరిఘాయుధమును {పరిఘ - ఇనుపకట్ల గుదియ}; కొని = తీసుకొని; మహేంద్రున్ = ఇంద్రుని; కిట్టి = సమీపించి; హనువుల్ = చెక్కిలిపైభాగమును; అడిచె = చరిచెను.

భావము:

ఇంద్రుడు వృత్రాసురుని శూలాన్ని వజ్రాయుధంతో ఖండించి దానితోనే అతని హస్తాన్ని నరికివేశాడు. వృత్రుడు ఆగ్రహోదగ్రుడై ఒంటిచేతితో పెద్ద ఇనుప గుదియను పట్టుకొని ఇంద్రుని పైకి ఉరికి దవడ మీద కొట్టాడు.