పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-399-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"యఁగ భక్తపాలనము లైన భవద్గుణజాల మాత్మ సం
స్మణము చేయ వాక్కు నిను న్నుతి చేయ శరీరమెల్లఁ గిం
పరివృత్తి చేయ మదిఁ గాంక్ష యొనర్చెదఁ గాని యొల్ల నే
రిది ధ్రువోన్నతస్థలము బ్జజు పట్టణ మింద్ర భోగమున్.

టీకా:

అరయగన్ = తరచి చూసినచో; భక్త = భక్తులను; పాలనములు = పాలించెడివి; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; గుణ = సుగుణముల; జాలమున్ = సమూహమును; ఆత్మన్ = మనసు; సంస్మరణము = చక్కగా స్మరించుటను; చేయన్ = చేయగా; వాక్కు = మాట; నినున్ = నిన్ను; సన్నుతిన్ = స్తుతించుటను; చేయన్ = చేయగా; శరీరము = దేహము; ఎల్ల = సర్వ; భంగిన్ = విధములగను; కింకర = సేవకుల యొక్క; పరివృత్తిన్ = చక్కగటి పనులను; చేయన్ = చేయగా; మదిన్ = మనసున; కాంక్ష = గట్టికోరుటను; ఒనర్చెదన్ = చేసెదను; కాని = అంతేకాని; ఒల్లన్ = ఒప్పుకొనను; నేన్ = నేను; అరిది = దుర్లభమైన; ధ్రువ = ధ్రువుని వంటి; ఉన్నత = ఉన్నతమైన; స్థలమున్ = పథమును; అబ్జజు = బ్రహ్మదేవుని; పట్టణము = నగరిని; ఇంద్ర = ఇంద్రుని; భోగమున్ = భోగములను.

భావము:

“నా హృదయం భక్తులను పాలించే నీ సద్గుణాలను స్మరించాలని, నా వాక్కు నిన్నే సన్నుతించాలని, నా శరీరం నీకు సేవ చేయాలని కోరుకుంటున్నది. ఇంతకు మించి నేను ధ్రువలోకాన్ని కాని, బ్రహ్మపదాన్ని కాని, ఇంద్రభోగాలను కాని ఇష్టపడను.