పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-398-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇప్పుడు వజ్రధారలం ద్రెంపబడిన విషయ భోగంబులు గలవాఁడ నయి, శరీరంబు విడిచి, భగవద్ధామంబు నొందెద; నారాయణుని దాసుండ నైన నాకు స్వర్గమర్త్యపాతాళంబులం గల సంపద్భోగంబులు నిచ్చగింపంబడవు; త్రైవర్గికాయాస రహితంబైన మహైశ్వర్యంబు ప్రసాదించుం గావున ననుపమేయం బైన భగవత్ప్రసాదం బన్యుల కగోచరం; బద్దేవుని పాదైక మూలంబుగా నుండు దాసులకు దాసానుదాసుండ నగుచున్నవాఁడ" నని యప్పరమేశ్వరు నుద్దేశించి.

టీకా:

ఇప్పుడు = ఇప్పుడు; వజ్ర = వజ్రాయుధము యొక్క; ధారలన్ = పదునులచేత; త్రెంపబడిన = త్రుంచబడిన; విషయ = ఇంద్రియార్థములను; భోగంబులు = అనుభవించుటలు; కల = కలిగిన; వాడను = వాడను; అయి = అయ్యి; శరీరంబు = దేహము; విడిచి = వదలి; భగవత్ = భగవంతుని; ధామంబున్ = పథమును; ఒందెదన్ = పొందెదను; నారాయణుని = విష్ణుమూర్తి యొక్క; దాసుండను = సేవకుడను; ఐన = అయిన; నా = నా; కున్ = కు; స్వర్గ = సర్గలోకము; మర్త్య = మానవలోకము; పాతాళంబులన్ = పాతాళలోకములలోను; కల = ఉన్నట్టి; సంపద = సంపదలు; భోగంబులున్ = భోగములను; ఇచ్చగింపబడవు = రుచించవు; త్రైవర్గిక = ధర్మార్థకామముల వలని; ఆయాస = ఆయాసము; రహితంబు = లేనట్టిది; ఐన = అయిన; మహా = గొప్ప; ఐశ్వర్యంబున్ = ఐశ్వర్యమును; ప్రసాదించున్ = దయచేయును; కావునన్ = అందుచేత; అనుపమేయంబు = సాటిలేనిది; ఐన = అయిన; భగవత్ = భగవంతుని; ప్రసాదంబు = ప్రసాదము; అన్యుల్ = ఇతరుల; కున్ = కు; అగోచరంబు = కనిపించనిది; ఆ = ఆ; దేవుని = భగవంతుని; పాద = పాదములు; ఏక = మాత్రమే; మూలంబున్ = ఆధారముగ; ఉండు = ఉండెడి; దాసుల్ = భక్తుల; కున్ = కు; దాస = సేవకుల; అనుదాసుండను = కింది సేవకుడను; అగుచున్నవాడను = అవుతున్నవాడను; అని = అని; ఆ = ఆ; పరమేశ్వరున్ = నారాయణుని; ఉద్దేశించి = గురించి.

భావము:

ఇలా వజ్రాయుధం వ్రేటుకు నా సంసార బంధాలన్నీ తెగిపోయి, పాంచభౌతికమైన ఈ శరీరాన్ని విడిచి సర్వేశ్వరుని సన్నిధికి చేరుకుంటాను. నేను నారాయణ భక్తి పరాయణుడను. నాకు స్వర్గ మర్త్య పాతాళ లోకాలలో కల భోగభాగ్యాలు ఏవీ ఇష్టం కావు. ధర్మార్థకామాల జంజాటాలు ఏమాత్రం లేని మహైశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుని అనుగ్రహం అనుపమాన మైనది. అన్యులకు అగోచరమైనది. నేను ఆ దేవాదిదేవుని పాదాలు సేవించే దాసులకు దాసానుదాసుడను” అని చెప్పి వృత్రాసురుడు పరమేశ్వరుని ఉద్దేశించి...