పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-397.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యెందుఁ గలఁడు విష్ణు డందు జయశ్రీలు
పొందు గాఁగ వచ్చి పొందుచుండు;
గాన భక్తవరదుఁ మలాక్షు సర్వేశు
దములందు మనముఁ దిలపఱతు.

టీకా:

సందేహము = అనుమానము; ఏటికిన్ = ఎందులకు; జంభారి = ఇంద్రుడా {జంభారి - జంభాసురుని సంహరించినవాడు, ఇంద్రుడు}; వేవేగ = వెంటనే; భిదురంబున్ = వజ్రాయుధమును; వ్రేయుము = ప్రయోగింపుము; ఆభీల = భయంకరమైన; భంగిన్ = విధముగ; అతి = మిక్కిలి; లోభిన్ = పిసినారిని; అడిగిన = కోరిన; అర్థ = సంపదల; రాశియున్ = సమూహములను; పోలెన్ = వలె; గడపకుము = దాటించివేయకుము; ఇది = ఇది; వృథా = వ్యర్థమైనది; కాదు = కాదు; సుమ్ము = సుమా; మురమర్ధనుని = విష్ణుమూర్తి యొక్క {మురమర్ధనుడు - ముర యనెడి రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు}; తేజమునన్ = తేజస్సుచేతను; ఆ = ఆ; దధీచి = దధీచి యొక్క; వీర్య = సామర్థ్యపు; అతిశయంబునన్ = గొప్పదనముతోను; అధికము = గొప్పది; అయినయది = ఐనది; కాన = కనుక హరి = విష్ణుమూర్తి; చేన్ = చేత; నియంత్రిత = నియమింపబడిన; ఉన్నతుడవు = గొప్పదనము గలవాడవు; ఐ = అయ్యి; గెలువుము = జయింపుము; శత్రుల = శత్రువుల; కీటు = గర్వమును; అడంచి = అణచివేసి;
ఎందున్ = ఎక్కడ; కలడు = ఉన్నాడో; విష్ణుడు = విష్ణుమూర్తి; అందున్ = అక్కడ; జయ = విజయము; శ్రీలు = శుభములు; పొందుగాగ = చక్కగా; వచ్చి = వచ్చి; పొందుచుండున్ = చేరుచుండును; కాన = కావున; భక్తవరదున్ = విష్ణుమూర్తి {భక్తవరదుడు - భక్త (భక్తులకు) వరదుడు (వరములను యిచ్చువాడు), విష్ణువు}; కమలాక్షున్ = విష్ణుమూర్తి {కమలాక్షుడు - కమలముల వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; సర్వేశున్ = విష్ణుమూర్తి {సర్వేశుడు - సర్వులకు ఈశుడు, విష్ణువు}; పదముల్ = పాదముల; అందున్ = ఎడల; మనమున్ = మనసును; పదిల = స్థిరముగ; పఱతున్ = ఉంచెదను.

భావము:

ఇంద్రా! అనుమాన మెందుకు? వెంటనే నీ వజ్రాయుధాన్ని భయంకరంగా ప్రయోగించు. మిక్కిలి పిసినారిని అడిగిన అర్థరాశి వలె నీ వజ్రాయుధం వ్యర్థం కాదు. విష్ణుదేవుని తేజస్సుతోను, దధీచి మహర్షి తపశ్శక్తితోను నీ వజ్రాయుధం శక్తి సంపన్నమై ఉన్నది. అందువల్ల శ్రీహరి ప్రోత్సాహంతో పోటుబంటువై నీ శత్రువునైన నన్ను జయించు. విష్ణువు ఎక్కడ ఉంటాడో విజయలక్ష్మి అక్కడే విరాజిల్లుతుంది. నేను భక్తవరదుడు, కమలలోచనుడు అయిన భగవంతుని పాదపద్మాల యందు నా హృదయాన్ని పదిలపరచుకొంటున్నాను.