పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-396-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కా ననుఁ గులిశధారల
దీకొని నిర్జింపఁ గలిగి తేనిఁ బ్రభూతో
ద్రేకంబు చేసి శూరుల
ప్రాట పదపద్మ ధూళి భాగంగగుదున్.


4-396/1-వ.
అని మఱియు వాసుదేవ కృపాలబ్ధదుర్నిరీక్ష్యుం డైన వజ్రహస్తునిం గని యిట్లనియె.
- తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి

టీకా:

కాక = అలాకాకుండగ; ననున్ = నన్ను; కులిశ = వజ్రము యొక్క; ధారలన్ = పదునులతో; దీకొని = ఎదిర్చి; నిర్జింపన్ = సంహరింప; కలిగితేని = సమర్థుడవైనచో; ప్రభూత = చక్కగా పుట్టిన; ఉద్రేకంబు = ఉద్రేకము; చేసి = వలన; శూరుల = వీరుల; ప్రాకటన్ = ప్రసిద్ధముగ; పద = పాదములు యనెడి; పద్మ = పద్మమముల; ధూళిన్ = ధూళిలోని; భాగంగన్ = భాగముగ; అగుదున్ = అవుతాను.

భావము:

అలా కాకుండా నీవు నన్ను వాడిగల వజ్రాయుధంతో ఓడించ గలిగితే ఈ పంచభూతాలలో కలిసిపోయి రణవీరుల పవిత్ర పాదపద్మ పరాగంలో భాగాన్ని సంపాదించుకొని కృతార్థుణ్ణి అవుతాను.