పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-394-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిక్కమగు పాపములచేఁ
జిక్కితివి నిశాత శూల శిఖరాగ్రమునన్
క్కించి నీదు మాంసము
క్కలుఁ గుక్కలును జేరి మల నొనర్తున్.

టీకా:

నిక్కము = సత్యము; అగు = అయిన; పాపముల్ = పాపముల; చేతన్ = వలన; చిక్కితివి = దొరకిపోయావు; నిశాత = వాడి యైన; శూల = శూలము; అగ్రమునన్ = మొనతో; మక్కించి = చంపి; నీదు = నీ యొక్క; మాంసమున్ = మాంసమును; నక్కలున్ = నక్కలు; కుక్కలునున్ = కుక్కలు; చేరి = కూడి; నమలన్ = తినునట్లు; ఒనర్తున్ = చేసెదను.

భావము:

నిజమైన పాపఫలితంగా నాచేత చిక్కావు. ఈ పదునైన శూలంతో నిన్ను చంపి, నీ మాంసాన్ని నక్కలు, కుక్కలు తినేటట్లు చేస్తాను.