పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-388-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ్గజంబు గులిశతిఁ గూలు కులమహీ
ధ్రంబుఁ బోలె రక్తధార లురల
స్తకంబు పగిలి దమఱి జిరజిరఁ
దిరిగి భీతితోడఁ దెరలి పఱచె.

టీకా:

ఆ = ఆ; గజంబున్ = ఏనుగు; కులిశ = వజ్రాయుధము యొక్క; హతిన్ = దెబ్బకు; కూలు = కూలిపోయెడి; కులమహీధ్రంబు = కులపర్వతముల; పోలెన్ = వలె; రక్త = రక్తపు; ధారలు = ధారలు; ఉరల = కారుతుండగ; మస్తకంబు = తలకాయ; పగిలి = పగిలిపోయి; మదము = మదము; ఆఱి = పోయి; జిరజిరన్ = జిరజిర అని; తిరిగి = గుండ్రముగ తిరిగి; భీతి = భయము; తోడన్ = తోటి; తెరలి = కళవెళపడి; పఱచె = పారిపోయెను.

భావము:

ఆ దెబ్బకు ఐరావతం వజ్రాయుధం దెబ్బ తిన్న పర్వతం వలె తల బ్రద్దలై నెత్తురు చిమ్మగా తల్లడిల్లి గిరగిర తిరిగి భయంతో పరుగు తీసింది.