పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-385-లగ్రా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కూలిరి వియచ్చరలు; సోలిరి దిశాధిపులు;-
వ్రాలి రమరవ్రజము; దూలి రురగేంద్రుల్;
ప్రేలిరి మరుత్తు; లెద జాలిగొని రాశ్వినులు;-
కాలుడిగి రుద్రు లవలీ బడి రార్తిన్;
వ్రేలిరి దినేశ్వరులు; కీలెడలినట్లు సుర;-
జాములు పెన్నిదుర పాగుచు ధారా
భీ గతితోడఁ దమ కేలిధనువుల్ విడిచి;-
నేలఁబడి మూర్ఛలను దేలిరి మహాత్మా!"

టీకా:

కూలిరి = పడిపోయిరి; వియచ్ఛరలు = ఆకాశగమనులు; సోలిరి = నీరసించిరి; దిశాధిపులు = దిక్పాలకులు {దిక్పాలకులు - అష్టదిక్కులను పాలించువారు}; వ్రాలిరి = పడిపోయిరి; అమర = దేవతల {అమరులు - మరణములేనివారు, దేవతలు}; వ్రజమున్ = సమూహములు; తూలిరి = తూలిపోయారు; ఉరగ = సర్ప {ఉరగము - ఉర (వక్షముతో) గము (కదులునది), పాము}; ఇంద్రుల్ = శ్రేష్ఠులు; ప్రేలిరి = అరచిరి; మరుత్తులున్ = మరుద్దేవతలు; ఎదన్ = హృదయములో; జాలిగొనిరి = భయపడిరి; అశ్వినులు = అశ్వినీదేవతలు; కాలుడిగి = నడవలేక; రుద్రులు = రుద్రగణములు; అవలీలల్ = అవలీలగా; పడిరి = పడిపోయారు; ఆర్తిన్ = బాధలలో; వ్రేలిరి = వేళ్ళాడిపోయారు; దినేశ్వరులు = ఆదిత్యులు; కీలు = శీల; ఎడలిన్ = ఊడిపోయిన; అట్లు = విధముగ; సుర = దేవతల; జాలములు = సమూహములు; పెన్నిదుర = మరణము; పాలగుచు = పొందుచు; ధారా = ఎడతెగని; ఆభీల = భయపడిన; గతిన్ = విధము; తోడన్ = తోటి; తమ = తమ యొక్క; కేలి = చేతులలోని; ధనువుల్ = విల్లులను; విడిచి = వదలి; నేలన్ = నేలమీద; పడి = పడిపోయి; మూర్ఛలనున్ = మూర్ఛర్చలలో; తేలిరి = తేలిపోయిరి; మహాత్మా = గొప్పవాడా.

భావము:

మహాత్మా! ఆ వృత్రాసురుని పెడబొబ్బకు గంధర్వాదులైన వియచ్చరులు నేల కూలారు. దిక్పతులు సోలిపోయారు. దేవతల సమూహం వ్రాలిపోయారు. నాగులు తూలిపోయారు. మరుత్తులు ప్రేలిపోయారు. అశ్వినీ కుమారులు దిగులుపడ్డారు. రుద్రగణాలు కాలు జారి పడ్డారు. ద్వాదశాదిత్యులు కీలూడి వ్రేలాడ బడ్డారు. సురసైనికులు పెద్ద నిద్దుర ఆవహించినట్లు చేతులలోని విల్లమ్ములను జార విడిచి నేలమీద పడి మూర్ఛిల్లారు.