పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-380-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సమరతలంబువాసి తన ప్రాపుమాసి, తీసిపఱచుచుండు దండనాయకులం జూచి, యకుటిలమతిం బకపక నగి వృత్రాసురుం, డిట్లనియె

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సమరతలంబున్ = యుద్ధభూమిని; వాసి = విడిచిపెట్టి; తన = తన యొక్క; ప్రాపున్ = ప్రాపకము, పొందును; మాసి = వదలి; తీసి = వేసి; పఱచుచుండు = పారిపోవు; దండనాయకులన్ = సేనానాయకులను; చూచి = చూసి; అకుటిల = స్వచ్ఛమైన; మతిన్ = మనసుతో; పకపక = పకపకమని; నగి = నవ్వి; వృత్ర = వృత్రుడు యనెడి; అసురుండు = రాక్షసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా తన అధీనంలోని దానవ సేనానాయకులు రణరంగాన్ని విడిచి పారిపోవటం చూచి వృత్రాసురుడు పకపక నవ్వి ఇలా అన్నాడు.