పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-379-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొంలఁ బోలెడు రక్కసు
లొండొరులం గడవఁ బాఱి రుక్కఱి పటు కో
దంముఖ సాధనంబులు
భంనమున వైచి దివిజతు లార్వంగన్.

టీకా:

కొండలన్ = పర్వతాలను; పోలెడు = వంటి; రక్కసులు = రాక్షసులు; ఒండొరులన్ = ఒకరినొకరు; కడవన్ = దాటుకొంటు; పాఱిరి = పారిపోయిరి; ఉక్కు = స్థైర్యము, బలము; అఱి = నశించి; పటు = బలిష్టమైన; కోదండ = విల్లులు; ముఖ = మొదలగు; సాధనంబులు = ఆయుధములు; భండనమునన్ = యుద్ధభూమిలో; వైచి = పారవేసి; దివిజ = దేవతా; పతులు = నాయకులు; ఆర్వంగన్ = అరచుచుండగ.

భావము:

కొండల వంటి ఉద్దండులైన రాక్షసులు పౌరుషం కోల్పోయి ధనుర్బాణాలు విడిచి యుద్ధరంగం నుండి పారిపోవటం చూసి దేవతలు వేళాకోళం చేస్తూ పెద్దగా అట్టహాసాలు చేశారు.