పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-366-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సువరు లేయు బాణములు చూడ్కి కగోచరమై నభస్థలం
ఱిముఱి గప్పి రేసి దివసాంతముఁ జేసిన లీల నా సురే
శ్వ బలయూధ వీరులను సాయక పంక్తుల చేత వాని రూ
శతధూళిఁ జేసి పఱపైన తమం బొనరించి రార్చుచున్.

టీకా:

సురవరులు = ఉత్తములైనదేవతలు; ఏయు = వేసెడి; బాణములు = బాణములు; చూడ్కి = చూపుల; కున్ = కు; అగోచరము = కనబడనివి; ఐ = అయ్యి; నభస్థలంబు = ఆకాశమండలము; అఱిముఱిన్ = కలతబడునట్లు; కప్పిరి = కప్పివేసిరి; ఏసి = విజృంభించి; దివసాంతమున్ = సాయంసంధ్యగా; చేసినన్ = చేయగా; లీలన్ = క్రీడవలె; అసురేశ్వర = రాక్షసుల; బల = సైనిక; యూధ = సమూహముల; వీరులను = వీరులను; సాయక = బాణముల; పంక్తుల్ = సమూహముల; చేతన్ = వలన; వాని = వారి; రూపఱన్ = రూపుమాయునట్లుగ; శత = అనేక; ధూళిన్ = చిన్నముక్కలు; చేసి = చేసి; పఱపు = చిక్కని; ఐన = అయిన; తమంబున్ = చీకట్లను; ఒనరించి = ఏర్పరచి; ఆర్చుచున్ = కేకలుపెట్టుచు.

భావము:

దేవతలు ప్రయోగించే బాణాలు కంటికి కనిపించకుండా ఆకాశమంతా కప్పి సంధ్యాసమయాన్ని తలపింపజేశాయి. ఆ దానవ వీరులు తమ బాణాలతో దేవతల బాణాలను నుగ్గు నుగ్గు చేసి కేకలు వేస్తూ రణరంగమంతా దట్టమైన చీకట్లు క్రమ్మేటట్లు చేశారు.