పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-365-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఒండొరులఁ గడవ నేసిన
కాంము లాకాశపథముఁ ప్పి మహోల్కా
దండంబు లొలసి నిష్ఠుర
భంన ముఖ మొప్పెఁ జూడఁ బ్రళయోచితమై.

టీకా:

ఒండొరులన్ = ఒకరినొకరు; కడవన్ = సంహరించుటకు; ఏసిన = వేసినట్టి; కాండముల్ = బాణములు; ఆకాశపథమున్ = ఆకాశమార్గమును; కప్పి = కప్పివేసి; మహా = గొప్ప; ఉల్కాదండంబున్ = తోకచుక్కలతో; ఒలసి = కలసిపోయి; నిష్ఠుర = అతికఠినమైన; భండనముఖము = యుద్ధభూమి; ఒప్పెన్ = ఒప్పియున్నది; చూడన్ = చూచుటకు; ప్రళయ = ప్రళయము; ఉచితము = అనదగినది; ఐ = అయ్యి.

భావము:

ఒకరి నొకరు సంహరించడానికి ప్రయోగించిన బాణాలు ఆకాశ మార్గమంతా నిండి నిప్పులు చిమ్మగా యుద్ధరంగం మహాప్రళయంగా కనిపించింది.