పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-364-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సురులకున్ సురావళికి య్యె మహారణ మప్పు డొండొరుల్
ముల గదాసి కుంత శర ముద్గర తోమర భిందిపాల ప
ట్టి పటుశూల చక్రముల ఠేవలు చూపి యదల్చి యార్చుచున్
లక కప్పి రస్త్రముల మార్కొని మంటలు మింట నంటగన్.

టీకా:

అసురుల్ = రాక్షసులు; కున్ = కి; సుర = దేవతా; ఆవళి = సమూహమున; కిన్ = కు; అయ్యెన్ = జరిగెను; మహా = గొప్ప; రణము = యుద్ధము; అప్పుడు = అప్పుడు; ఒండొరుల్ = ఒకరినొకరు; ముసల = రోకలివంటి ఆయుధము; గద = గద; అసి = కత్తి; కుంత = కుంతలము, ఈటెలు; శర = బాణములు; ముద్గర = తవ్వుగోల; తోమర = చిల్లగోల; భిందిపాల = భిండిపాల, గుదియలు; పట్టిస = అడ్డకత్తులు; పటు = పటిష్టమైన; శూల = శూలములు; చక్రములన్ = చక్రములు; ఠేవలు = ప్రయోగవిశిష్టతలు; చూపి = ప్రదర్శించి; అదల్చి = బెదిరించి; ఆర్చుచున్ = అరచుచు; మసలక = వెనుదిరగక; కప్పిరి = కప్పివేసిరి; అస్త్రములన్ = ఆయుధములతో; మార్కొని = ఎదుర్కొని; మంటలు = మంటలు; మింటన్ = ఆకాశమును; అంటగన్ = తగులునట్లుగ.

భావము:

రాక్షసులకు, దేవతలకు మధ్య భయంకరమైన మహాసంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళు రోకళ్ళతో, గదలతో, ఖడ్గాలతో, ఈటెలతో, బాణాలతో, తవ్వుకొలలతో, చిల్లకోలలతో, గుదియలతో, అడ్డకత్తులతో, శూలాలతో, చక్రాలతో గర్వంగా అరుస్తూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఒకరి పైకి ఒకరు లంఘించి అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటే విధంగా శస్త్రాస్త్రాలతో శత్రు సైన్యాలను కప్పివేశారు.