పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-362-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాగళుఁ డడిరి కడువడిఁ
గాలునిపైఁ గవయు మాడ్కి రతర రవ సం
చాలిత పూర్వ దిగంతరుఁ
డై లీల మహేంద్రుమీఁద తఁ డరిగె నృపా!

టీకా:

కాలగళుడు = నీలకంఠుడు {కాలగళుడు - కాల (నల్లని) గళుడు (కంఠము గలవాడు), శివుడు}; అడరి = కోపించి; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగా; కాలుని = యముని; పైన్ = మీద; కవయు = కలియబడెడి; మాడ్కి = వలె; ఖరతర = అతి కఠినమైన; రవ = శబ్దములచే; సంచాలిత = మిక్కిలి చలించిన; పూర్వ = తూర్పు; దిగంతరుండు = దిగంతము గలవాడు; ఐ = అయ్యి; లీలన్ = క్రీడవలె; మహేంద్రు = ఇంద్రుని; మీదన్ = పైకి; అతడు = అతడు; అరిగె = దాడికి వెళ్ళెను; నృపా = రాజా.

భావము:

రాజా! శివుడు రౌద్రావేశంతో యమధర్మరాజు మీదికి లంఘించినట్లు వృత్రాసురుడు తూర్పుదిక్కు దద్దరిల్లేటట్లు గర్జిస్తూ ఇంద్రుని మీదికి దూకాడు.