పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-358-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డుగరాని సొమ్ము డుగ రాదని మానఁ
డుగువాని మాట డుగ నేల?
భ్రాంతి నడుగుచోటఁ బ్రాణంబు లేనియు
నిచ్చువాఁడు దాఁపఁ డిచ్చుఁ గాని."

టీకా:

అడుగరాని = కోరకూడని; సొమ్మున్ = వస్తువును; అడుగ = కోర; రాదు = రాదు; అని = అని; మానడు = మానివేయడు; అడుగువాని = వేడెడివాని; మాటలు = వివరములను; అడుగన్ = విచారించుట; ఏల = ఎందుకు; భ్రాంతిన్ = భ్రాంతితో; అడుగుచోటన్ = కోరినప్పుడు; ప్రాణంబులు = ప్రాణములు; ఏనియున్ = అయినప్పటికిని; ఇచ్చువాడు = దాత; దాపడు = దాచుకొనడు; ఇచ్చున్ = ఇచ్చును; కాని = తప్పక.

భావము:

అడుగ వచ్చినవాడు అడుగరానిదని అడగడం మానుకొనడు. అడిగేవాని మాట లెలా ఉంటాయో వేరే అడగడం ఎందుకు? ఇచ్చే గుణం ఉన్న దాత ఆశపడి ఎవరైనా అడిగితే ప్రాణాలనైనా ఇస్తాడు.”