పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-355-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థంబు వేఁడెడు ర్థులు గలరు గా-
కంగంబు వేఁడెడి ర్థి గలఁడె?
గు కోరికల నిచ్చు దానశీలుఁడు గల్గుఁ-
న దేహ మీ నేర్చు దాత గలఁడె?
యీ నేర్చువాఁడు దన్నిచ్చిన రోయక-
చంపెడునట్టి యాకుఁడు గలఁడె?
చంపియుఁ బోవక ల్యంబు లన్నియు-
నేఱి పంచుక పోవువారు గలరె?

6-355.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మణ లోకమెల్ల క్షించు వారికి
హింస చేయుబుద్ధి యెట్టు పొడమె?
భ్రాంతి యైనయట్టి ప్రాణంబుపైఁ దీపు
మకుఁ బోలె నెదిరిఁ లఁప వలదె? "

టీకా:

అర్థంబున్ = ధనమును; వేడెడు = కోరెడు; అర్థులున్ = వేడెడివారు; కలరు = ఉన్నారు; కాక = అలాకాకుండ; అంగంబున్ = శరీరమును; వేడెడి = అర్థించెడి; అర్థి = కోరెడివాడు; కలడె = ఉన్నాడా ఏమి; తగు = యుక్తమైన; కోరికలన్ = అడిగినవాటిని; ఇచ్చు = ఇచ్చెడి; దానశీలుడు = దాన మిచ్చెడి వర్తన గలవాడు, దాత; కల్గున్ = ఉండును; తన = తన యొక్క; దేహమున్ = శరీరమును; ఈన్ = ఇచ్చెడి; నేర్చు = నేర్పు గల; దాత = దానము నిచ్చువాడు; కలడే = ఉండునా ఏమి; ఈన్ = ఇచ్చెడి; నేర్చు = నేర్పుగల; వాడు = వాడు; తన్నున్ = తనదేహమును; ఇచ్చినన్ = ఇచ్చి నప్పటికిని; రోయక = ఏహ్యపడక; చంపెడునట్టి = చంపివేసెడి; యాచకుడు = అర్థి; కలడె = ఉన్నాడా ఏమి; చంపియు = చంపేసి; పోవక = వెళ్ళిపోక; శల్యంబులు = ఎముకలు; అన్నియున్ = అన్నిటిని; ఏఱి = ఏరుకొని; పంచుకపోవు = పట్టుకుపోయెడి; వారు = వారు; కలరె = ఉన్నారా ఏమి.
రమణన్ = మనోజ్ఞముగ; లోకము = లోకములు; ఎల్లన్ = అన్నిటిని; రక్షించు = పాలించెడి; వారు = వారల; కిన్ = కి; హింస = సంహరము; చేయు = చేసెడి; బుద్ధి = భావము; ఎట్టు = ఏ విధముగ; పొడమె = పుట్టెను; భ్రాంతి = భ్రాంతి; ఐనన్ = అయిన; అట్టి = అటువంటి; ప్రాణంబు = ప్రాణముల; పై = మీద; తీపు = తీపి; తమ = తమ; కున్ = కు; పోలెన్ = వలె; ఎదిరి = ఎదుటివారిని; తలప = భావించ; వలదె = వద్దా.

భావము:

ఈ లోకంలో సంపద లిమ్మని అడిగే యాచకులు ఉంటారు కాని దేహం ఇమ్మని అర్థించేవాడు ఉంటాడా? అడిగిన కోరికలను తీర్చే దాతలు ఉంటారు కాని దేహాన్ని దానంగా ఇచ్చే దాత ఉంటాడా? ఒకవేళ దాత దేహమిచ్చినా కాదనక చంపే యాచకు డుంటాడా? దాతను చంపినా ఎముకలన్నీ ఏరి పంచుకొనే వారుంటారా? లోకాలను దయతో రక్షించే మీకు ఈ హింసాత్మకమైన బుద్ధి ఎలా పుట్టింది? మీ ప్రాణాలు మీకెంత తీపో ఎదుటివాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళకు అంత తీపి అన్న విషయం మీ ఆలోచనకు రాలేదా?