పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-352-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నావుడునా దధీచియు మనంబున సంతసమంది నవ్వి సం
భావిత వాక్య పద్ధతులఁ ల్కుచు నిట్లనెఁ బేర్మితోడ "నో!
దేతలార! ప్రాణులకుఁ దెక్కలి మృత్యుభయంబు పూనుటే
భాములం దలంపరు కృపామతి నెన్నఁడు మీ మనంబులన్.

టీకా:

నావుడున్ = అనగా; ఆ = ఆ; దధీచియు = దధీచి; మనంబునన్ = మనసులో; సంతసము = సంతోషమును; అంది = పొంది; నవ్వి = నవ్వి; సంభావిత = యుక్తమైన; వాక్య = సంభాషణల; పద్ధతులన్ = రీతులలో; పల్కుచున్ = పలుకుచు; ఇట్లు = ఈ విధముగ; అనెన్ = పలికెను; పేర్మి = కూరిమి; తోడన్ = తోటి; ఓ = ఓ; దేవతలారా = దేవతలూ; ప్రాణుల్ = ప్రాణులు; కున్ = కు; తెక్కలి = వంచకపు; మృత్యు = మరణ; భయంబున్ = భయమును; పూనుట = కలుగుట; ఏ = ఎట్టి; భావములన్ = ఆలోచనలలోను; తలంపరు = ఊహించరు; కృపా = దయగల; మతిన్ = బుద్ధితో; ఎన్నడున్ = ఎప్పుడును; మీ = మీ యొక్క; మనంబులన్ = మనసులలో.

భావము:

ఇంద్రుని మాటలు విని దధీచి లోలోపల సంతోషించి చిరునవ్వు నవ్వి గౌరవ పురస్సరంగా ఆప్యాయంగా ఇలా అన్నాడు “దేవతలారా! మానవులకు మృత్యుభయం సహజంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఎన్నడూ మీ మనస్సులలో తలపోయరు.