పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-351-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డుగంగరాని వస్తువు
డుగరు బతిమాలి యెట్టి ర్థులు నిను నే
డిగితిమి దేహమెల్లను
డు నడిగెడు వారికేడ రుణ? మహాత్మా! "

టీకా:

అడుగంగరాని = కోరకూడని; వస్తువులున్ = వస్తువులను; అడుగరు = కోరరు; బతిమాలి = బతిమాలి; ఎట్టి = ఎటువంటి; అర్థులున్ = వేడువారైనను; నిను = నిన్ను; నేము = మేము; అడిగితిమి = కోరితిమి; దేహమున్ = శరీరము; ఎల్లన్ = అంతయును; కడున్ = మిక్కిలి; అడిగెడువారి = కోరెడివాని; కిన్ = కి; ఏడన్ = ఎక్కడ యుండును; కరుణ = దయ; మహాత్మా = గొప్పవాడా.

భావము:

ఓ మహానుభావా! యాచకులు అర్థింపదగిన వస్తువునే అర్థిస్తారు కాని అడుగరాని వస్తువును బతిమాలి అడగరు. మేము నీ దేహం మొత్తాన్ని అడుగుతున్నాము. నిజానికి దాతలను అడిగేవారికి దయా దాక్షిణ్యాలు ఉండవు”.