పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-350-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీగతి యెల్లభంగుల
యాన యని తెలిసి తగని డుగుదు రేనిన్
యాక వర్గము లోపల
నీకులనఁ బడరె? యెంత నేర్పరులైనన్.

టీకా:

నీచ = నీచమైన; గతిన్ = విధము; ఎల్ల = అన్ని; భంగులన్ = రకములుగా; యాచన = యాచించుట; అని = అని; తెలిసి = తెలిసి; తగనిది = యుక్తము కానిది; అడుగుదురేని = అడిగినను; యాచక = యాచకుల; వర్గము = సమూహముల; లోపల = అందును; నీచకులు = అతి నీచులు; అనబడరె = అనబడరా ఏమి; ఎంత = ఎంతటి; నేర్పరులు = నేర్పులు గలవారు; ఐనన్ = అయినను

భావము:

యాచన అన్ని విధాల నీచమైన కృత్యమని తెలిసికూడా తగనిదానిని అడగటానికి సిద్ధమైన యాచకులు పరమ నీచులని అనటంలో సందేహం లేదు. ఈ విషయంలో ఎంత నేర్పరులైనా యాచకులు నీచాతినీచులే!