పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-341-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రయ మాతేజములతోడ నాయుధములు
మ్రింగి భువన త్రయంబును మ్రింగుచున్న
భీకరాకారు వృత్రునిఁ బీచ మడఁచి
యెల్ల భంగుల మా భంగ మీఁగు మభవ!

టీకా:

అరయ = చూడగా; మా = మా యొక్క; తేజముల్ = శక్తిసామర్థ్యముల; తోడన్ = తోటి; ఆయుధములున్ = ఆయుధములను కూడ; మ్రింగి = మింగేసి, భక్షించి; భువనత్రయంబునున్ = ముల్లోకములను; మ్రింగుచున్న = భక్షిస్తున్న; భీకర = భయంకరమైన; ఆకారున్ = ఆకారము గలవాడైన; వృత్రునిన్ = వృత్రుని; పీచము = గర్వము; అడచి = అణచివేసి; ఎల్ల = అన్ని; భంగుల = విధముల; మా = మా యొక్క; భంగము = భంగపాటును; ఈగుము = పోగొట్టుము; అభవ = హరి {అభవుడు - భవము (పుట్టుక) లేనివాడు, విష్ణువు}.

భావము:

పుట్టుకయే లేని ఓ దేవా! భీకరాకారుడైన వృత్రాసురుడు మా తేజస్సులనే కాక ఆయుధాలను కూడా మ్రింగి ముల్లోకాలకు సైతం దిగమ్రింగుతున్నాడు. ఈ రాక్షసుని అహంకారాన్ని అణచి మా భంగపాటుకు ప్రతీకారం చేయాలి.