పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-339-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కట! దిక్కుల కెల్ల దిక్కైన మాకు
నొక్క దిక్కును లేదు కాలూనఁ నైన;
దిక్కుగావయ్య! నేఁడు మా దిక్కుఁ జూచి
దిక్కు లేకున్నవారల దిక్కు నీవ.

టీకా:

అకట = అయ్యో; దిక్కుల్ = దిక్కుల; ఎల్లన్ = అన్నిటికిని; దిక్కైన = అధినాయకులమైన; మా = మా; కున్ = కు; ఒక్క = ఏ యొక్క; దిక్కు = మూలను కూడ; లేదు = లేదు; కాలూనన్ = నిలబడెడి యాధారము; ఐనన్ = అయినప్పటికిని; దిక్కు = శరణిచ్చు వాడవు; కావుము = అగుము; అయ్య = తండ్రి; నేడు = ఇప్పుడు; మా = మా; దిక్కు = వైపునకు; చూచి = చూసి; దిక్కు = ఆధారము; లేకున్న = లేనట్టి; వారల = వారికి; దిక్కు = రక్షకుడవు; నీవ = నీవే.

భావము:

అయ్యో! దిక్కులకు అధిపతులమైన మాకు ఈనాడు కాలూని నిలబడటానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మా దిక్కు చూచి నీవే మా దిక్కు కావాలి. దిక్కులేని దీనులకు నీవే దిక్కు కదా!