పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-336-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దండంబు యోగీంద్రమండల నుతునకు-
దండంబు శార్ఙ్గ కోదండునకును;
దండంబు మండిత కుండల ద్వయునకు-
దండంబు నిష్ఠుర భండనునకు;
దండంబు మత్తవేదండ రక్షకునకు-
దండంబు రాక్షసఖండనునకు;
దండంబు పూర్ణేందు మండల ముఖునకు-
దండంబు తేజః ప్రచండునకును;

6-336.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దండ మద్భుత పుణ్యప్రధానునకును;
దండ ముత్తమ వైకుంఠధామునకును;
దండ మాశ్రిత రక్షణ త్పరునకు;
దండ మురు భోగినాయక ల్పునకును.

టీకా:

దండంబు = నమస్కారము; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; మండల = సమూహములచే; నుతున్ = స్తుతింపబడెడివాని; కున్ = కి; దండంబు = నమస్కారము; శార్ఙ్గ = శార్ఙ్గము అనెడి; కోదండున్ = విల్లుగలవాని; కును = కి; దండంబు = నమస్కారము; మండిత = అలంకరింపబడిన; కుండల = చెవికుండలముల; ద్వయున్ = జంటగలవాని; కు = కి; దండంబు = నమస్కారము; నిష్ఠుర = అతి కఠినమైన; భండనున్ = యుద్దము చేయువాని; కు = కి; దండంబు = నమస్కారము; మత్తవేదండ = గజేంద్రమును; రక్షకున = కాపాడినవాని; కున్ = కి; దండంబు = నమస్కారము; రాక్షస = రాక్షసులను; ఖండనున్ = సంహరించినవాని; కు = కి; దండంబు = నమస్కారము; పూర్ణ = నిండు; ఇందు = చంద్ర; మండల = మండలమువంటి; ముఖున్ = ముఖము గలవాని; కు = కి; దండంబు = నమస్కారము; తేజస్ = తేజస్సు; ప్రచండున్ = అతి తీవ్రమైనది గలవాని; కున్ = కి;
దండము = నమస్కారము; అద్భుత = అద్భుతమైన; పుణ్య = పుణ్యములను; ప్రధానున్ = ఇచ్చెడివాని; కును = కి; దండము = నమస్కారము; ఉత్తమ = శ్రేష్ఠమైన; వైకుంఠ = వైకంఠము; ధామున్ = నివాసముగా గలవాని; కును = కి; దండము = నమస్కారము; ఆశ్రిత = ఆశ్రయించినవారిని; రక్షణ = కాపాడుట యందు; తత్పరున్ = లగ్నమగువాని; కు = కి; దండము = నమస్కారము; ఉరు = శ్రేష్ఠమగు; భోగినాయక = ఆదిశేషుని {భోగి నాయకుడు - భోగి (సర్పము)లకు నాయకుడు, శేషుడు}; తల్పున్ = పాన్పుగా గలవాని; కును = కి.

భావము:

యోగుల సమూహం చేత స్తుతింపబడే నీకు వందనం; శార్ఙ్గమనే ధనుస్సును ధరించినవానికి వందనం; ప్రకాశించే రెండు కుండలాలు గలవానికి వందనం; కఠినమైన కవచం కలవానికి వందనం; మదగజాన్ని రక్షించినవానికి వందనం; రాక్షసులను శిక్షించినవానికి వందనం; నిండు చంద్రుని వంటి ముఖం కలవానిని వందనం; గొప్ప తేజస్సు కలవానికి వందనం; అద్భుతమైన పుణ్యాల నిచ్చేవానికి వందనం; ఉత్తమమైన వైకుంఠంలో నివసించేవానికి వందనం; ఆశ్రయించిన వారిని రక్షించేవానికి వందనం; శేషతల్పునకు వందనం.