పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-334-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు జగన్మోహనాకారుండయిన నారాయణుని కృపావలోక నాహ్లాద చకిత స్వభావ చరితులై సాష్టాంగదండప్రణామంబు లాచరించి ఫాలభాగ పరికీలిత కరకమలులై యిట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; జగన్ = జగత్తు అంతటికిని; మోహన = మోహింప జేసెడి; ఆకారుండు = స్వరూపము గలవాడు; అయిన = ఐన; నారాయణుని = నారాయణుని; కృపా = దయామయమైన; అవలోకన = చూపులుచే; ఆహ్లాద = సంతోషపడిన; చకిత = సంభ్రమమైన; స్వభావ = తమ మనసులు; చరితులు = వర్తనలు గలవారు; ఐ = అయ్యి; సాష్టాంగదండప్రణామంబులు = సాషాంగ నమస్కారములు; ఆచరించి = చేసి; ఫాలభాగ = నుదిట; పరికీలిత = తగల్చబడిన; కర = చేతులు యనెడి; కమలులు = పద్మములు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ఈ విధంగా భువన మోహనాకారుడైన నారాయణుని కరుణా కటాక్ష వీక్షణాలతో ఆశ్చర్యాన్ని పొందిన దేవతలు సాష్టాంగ నమస్కారాలు చేసి ఫాలభాగాన చేతులు జోడించి ఇలా అన్నారు.