పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-333.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బుద్ధిఁ బోల్పరాని పుణ్యంబుఁ దత్పాద
మల జనిత యైన గంగ దెలుప
ప్రమేయుఁ డభవు వ్యక్తుఁ డవ్యయు
డాదిపురుషుఁ డఖిలమోది యొప్పె.

టీకా:

తన = తన యొక్క; సేవకుల = భక్తుల; లోనన్ = మనములలో; తడబడు = చలించెడి; రూపంబు = స్వరూపము; శ్రీవత్స = శ్రీవత్సము; కౌస్తుభ = కౌస్తుభమణి; శ్రీలన్ = శోభలను; తెలుపన్ = తెలియజేయ; వికచ = వికసించిన; అబ్జముల = పద్మముల; తోడన్ = తోటి; వీడ్వడు = మారుపడగల; కన్నుల = కన్నుల యొక్క; కడలు = చివరలు; దైవాఱెడు = పొంగిపొరలెడి; కరుణన్ = కృపను; తెలుపన్ = తెలియజేయ; ఎల్ల = సమస్తమైన; లోకముల్ = లోకముల; కున్ = కు; ఇల్లు = నివాసము; ఐన = అయినట్టి; భాగ్యంబున్ = భాగ్యమును; కాపురంబుండెడు = కాపురము చేస్తున్న; కమల = లక్ష్మీదేవి; తెలుపన్ = తెలియజేయ; మూడుమూర్తుల్ = త్రిమూర్తుల {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2విష్ణు 3మహేశ్వరులు}; కును = కి; మొదలు = మూలము; ఐన = అయిన; తేజంబున్ = శక్తిని; ధాతన్ = బ్రహ్మదేవుని; పుట్టించిన = జనింపజేసిన; తమ్మి = పద్మము; తెలుపన్ = తెలియజేయ;
బుద్ధిన్ = మనసుతో; పోల్పరాని = పోల్చుకొన శక్యము గాని; పుణ్యంబున్ = పుణ్య స్వరూపమును; తత్ = అతని; పాద = పాదములు యనెడి; కమల = పద్మము లందు; జనిత = పుట్టినట్టిది; ఐన = అయిన; గంగ = గంగానది; తెలుపన్ = తెలియజేయ; అప్రమేయుడు = హరి {అప్రమేయుడు - ప్రమేయములు (పరిమితులు) లేనివాడు, విష్ణువు}; అభవుడు = హరి {అభవుడు - భవము (పుట్టుక) లేనివాడు, విష్ణువు}; అవ్యక్తుడు = హరి {అవ్యక్తుడు - వ్యక్తము (తెలియ) శక్యము కానివాడు, విష్ణువు}; అవ్యయుడు = హరి {అవ్యయుడు - వ్యయము (నాశము) లేనివాడు, విష్ణువు}; ఆదిపురుషుడు = హరి {ఆదిపురుషుడు – సృష్టి మొదటి పరమాత్మ (కారకుడు), విష్ణువు}; అఖిలమోది = హరి {అఖిల మోది - అఖిల (అందరను) మోది (సంతోషింప జేయువాడు), విష్ణువు} ఒప్పె = చక్కకా నుండెను.

భావము:

రూపు రేఖలన్నీ ఒకే విధంగా ఉన్నా వక్షఃస్థలాన విలసిల్లే శ్రీవత్సం, కౌస్తుభం సేవకుల కంటే ఆయన ప్రత్యేకతను వెల్లిడిస్తున్నాయి; వికసించిన తామరల వలె ఉన్నా కన్నులు దయను కురిపిస్తూ తమ ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి; లోకాలన్నింటికీ ఆలవాలమైన ఐశ్వర్యాన్ని అతనితో కాపురం చేసే లక్ష్మీదేవి తెలుపుతున్నది; ముమ్మూర్తులకు మూలభూతమైన అతని తేజస్సును బ్రహ్మను పుట్టించిన నాభి కమలం తెలియజేస్తున్నది; అతని పాదపద్మాల నుండి పుట్టిన గంగానది బుద్ధికి తోచని పుణ్యాన్ని వెల్లడిస్తున్నది; ఈ విధంగా అభవుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అవ్యక్తుడు, ఆది పురుషుడు అయిన శ్రీమన్నారాయణుడు విలసిల్లాడు.