పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-332.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దెల్ల దమ్మివిరులఁ దెగడు కన్నులవాని
వసుధాద్రవంపు వ్వువానిఁ
నియె వేల్పుపిండు ప్పరపాటుతోఁ
న్నులందు నున్న ఱవు దీఱ.

టీకా:

తగు = యుక్త మగు; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గద = గదలను; ధరుండు = ధరించినవాడు; అగున్ = అయిన; వానిన్ = వాడిని (హరిని); శ్రీవత్స = శ్రీవత్సము; కౌస్తుభ = కౌస్తుభమణి; శ్రీల = శోభలు గల; వానిన్ = వాడిని (హరిని); కమనీయ = అందమైన; మాణిక్య = మాణిక్యములు పొదిగిన; ఘన = గొప్ప; కిరీటము = కిరీటము; వానిన్ = వాడిని (హరిని); దివ్య = దివ్యమైన; విభూషణ = విశిష్టాలంకారముల; దీప్తి = ప్రకాశము గల; వానిన్ = వాడిని (హరిని); మండిత = అలంకరింపబడిన; కేయూర = భుజకీర్తులు; కుండలంబుల = చెవికుండలములు గల; వానిన్ = వాడిని (హరిని); సిరి = లక్ష్మీదేవి; ఉరస్థలమునన్ = వక్షస్థలము నందు; చెలగు = వర్తించెడి; వానిన్ = వాడిని (హరిని); తనున్ = తనను; పోలు = పోలిన; సేవక = సేవకుల; తండంబు = సమూహము; కల = కలిగిన; వానిన్ = వాడిని (హరిని); జిలుగైన = మెరుపు గల; పచ్చని = పచ్చని; వలువ = వస్త్రములు గల; వానిన్ = వాడిని (హరిని); తెల్ల = తెల్లని; తమ్మి = పద్మము; విరులన్ = పువ్వులను; తెగడు = నిరసించెడి;
కన్నుల = కన్నులు గల; వానిన్ = వాడిని (హరిని); నవ = సరికొత్త; సుధాద్రవంపు = అమృతపు; నవ్వు = దరహాసము గల; వానిన్ = వాడిని (హరిని); కనియె = దర్శించెను; వేల్పు = దేవతల; పిండు = సమూహము; కప్పరపాటు = తొట్రుపాటు; తోన్ = తోటి; కన్నుల = కన్నుల; అందు = లో; ఉన్న = ఉన్నట్టి; కఱవు = కరువు; తీఱ = తీరిపోగా.

భావము:

శంఖ, చక్ర, గదలను ధరించినవాడు; శ్రీవత్సం, కౌస్తుభం శోభించే ఉరోభాగం కలవాడు; తలపై విరాజిల్లుతున్న రమణీయ కిరీటం కలవాడు; ప్రకాశిస్తున్న భుజకీర్తులు మకరకుండలాలు కలవాడు; లక్ష్మీదేవి విలసిల్లే వక్షఃస్థలం కలవాడు; తనతో సమానులైన సేవకుల సమూహం కలవాడు; వెలుగులు వెదజల్లే పట్టు పీతాంబరం కలవాడు; తెల్లతామర రేకుల సోయగాలు వెల్లివిరిసే కన్నులు కలవాడు; మధుర సుధారసాలు పొంగి పొరలే మందహాసం కలవాడు అయిన శ్రీహరి యొక్క దివ్య సుందర స్వరూపాన్ని దేవతల సమూహం కన్నుల కరువు తీరే విధంగా చూసింది.