పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-331-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు స్తుతియించుచున్న దేవతలకు భక్తవత్సలుండైన వైకుంఠుండు ప్రసన్నుం డయ్యె నప్పుడు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; స్తుతియించుతున్న = కీర్తించుతున్న; దేవతల్ = దేవతల; కున్ = కు; భక్త = భక్తుల యెడ; వత్సలుండు = వాత్సల్యము గలవాడు; ఐన = అయిన; వైకుంఠుండు = విష్ణుమూర్తి {వైకుంఠుడు - వైకుంఠమున యుండువాడు, విష్ణువు}; ప్రసన్నుండు = సంతుష్టుండు; అయ్యెన్ = అయ్యెను; అప్పుడు = అప్పుడు.

భావము:

అని ఈ విధంగా పొగడుతున్న దేవతలకు భక్తవత్సలుడు, వైకుంఠవాసుడు అయిన శ్రీహరి ప్రసన్నుడైనాడు. అప్పుడు...