పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-323-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సర్వసాధనంబులతోడ సాధుజనంబుల వృత్రాసురుండు మ్రింగిన, నచ్చరుపడి చేయునది లేక త త్తేజోవిశేష విభవంబునకు భయంబు నొంది, కందిన డెందంబునం గుందుచుం, బురందర ప్రముఖు లార్తరక్షకుండగు పుండరీకాక్షునకుం గుయ్యిడు వారలై.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సర్వ = సమస్తమైన; సాధనంబుల = ఆయుధముల; తోడ = తోటి; సాధు = దేవతా; జనంబులన్ = జనులను; వృత్ర = వృత్రుడు యనెడి; అసురుండు = రాక్షసుడు; మ్రింగినన్ = మింగివేయగా; అచ్చరుపడి = ఆశ్చర్యపోయి; చేయునది = చేయగలది; లేక = లేక; తత్ = అతని; తేజః = తేజస్సు యొక్క; విశేష = విశిష్టమైన; విభవంబున్ = వైభవమున; కున్ = కు; భయంబున్ = భయమును; ఒంది = పొంది; కందిన = తపించిన; డెందంబునన్ = హృదయము నందు; కుందుచు = బాధపడుతు; పురంధర = ఇంద్రుడు; ప్రముఖుల్ = మొదలగు ముఖ్యులు; ఆర్త = దుఃఖము చెందినవారిని; రక్షకుడు = కాపాడెడివాడు; అగు = అయిన; పుండరీకాక్షున్ = నారాయణుని; కున్ = కి; కుయ్యిడు = మొరపెట్టుకొను; వారలు = వారు; ఐ = అయ్యి.

భావము:

ఈ విధంగా సర్వ శస్త్రాస్త్రాలతో దేవతలను వృత్రాసురుడు మ్రింగి వేయగా ఆశ్చర్యంతో ఏమీ చేయలేక, అతని తేజోవిశేషాన్ని చూచి బెదరి చెదరిన హృదయాలతో ఆర్తరక్షకుడైన శ్రీహరిని శరణు పొందుదా మనుకొని...