పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-321-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి వృత్రునిమీఁద దేవత ల్కతోఁ బెనుమూఁక లై
చుట్టిముట్టి మహాస్త్రవిద్యలు చూపి యేపున నేయ నా
గొట్టువీరుఁడు వార లేసిన క్రూరశస్త్రము లన్నియుం
జుట్టి పట్టుక మ్రింగి శూరత జోక నార్చె మహోగ్రుఁడై.

టీకా:

అట్టి = అటువంటి; వృత్రుని = వృత్రుడి; మీద = పైని; దేవతలు = దేవతలు; అల్క = కోపము; తోన్ = తోటి; పెను = పెద్దపెద్ద; మూకలు = గుంపులు కట్టినవారు; ఐ = అయ్యి; చుట్టిముట్టి = చుట్టిముట్టి; మహా = గొప్ప; అస్త్ర = అస్త్రముల; విద్యలు = విద్యలను; చూపి = ప్రదర్శించి; ఏపునన్ = విస్తారముగా; ఏయన్ = వేయగా; ఆ = ఆ; గొట్టు = దుష్ట; వీరుడు = వీరుడు; వారలు = వారు; ఏసిన = వేసిన; క్రూర = భయంకరమైన; శస్త్రములు = శస్త్రములు; అన్నియున్ = సర్వమును; చుట్టిపట్టుక = కలిపిచుట్టి; మ్రింగి = మింగేసి; శూరతన్ = శౌర్యముతో; జోకనార్చెన్ = గర్జించెను {జోకనార్చు - జోకను (ఉత్సాహముతో) అర్చు (అరచుట), గర్జించు}; మహా = గొప్ప; ఉగ్రుడు = భయంకరుడు; ఐ = అయ్యి.

భావము:

అటువంటి వృత్రాసురుని దేవతలంతా మూకుమ్మడిగా కోపంతో చుట్టుముట్టి దివ్యాస్త్రాలను ప్రయోగించారు. వీరాధివీరుడైన ఆ వృత్రాసురుడు ఆ అస్త్రాలను చుట్టచుట్టి నోటిలో పెట్టుకొని గుటుక్కున మ్రింగి మహా భయంకరంగా గర్జించాడు.