పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-318-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యుము ద్రుంగెడునాఁడు ములు పొలియించు-
నంతకుమూర్తిపై నింత యగుచుఁ;
ఱపును బొడువును బ్రతిదినంబును నొక్క-
పాత మంగంబు విరివిగొనుచుఁ,
డు దగ్ధ శైల సంకాశ దేహము నందుఁ-
రము సంధ్యారాగకాంతి బెరయ;
మును గాఁక రాగిచేఁ నుమించు మించులఁ-
ఱకుమీసలు కచాగ్రములు మెఱయఁ;

6-318.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జండ మధ్యాహ్న మార్తాండ మండ లోగ్ర
టుల నిష్ఠుర లోచనాంల విధూత
శ దిశాభాగుఁ డుజ్జ్వలర కరాళ
భిదుర సునిశిత దంష్ట్రోరు నగుహుఁడు.

టీకా:

యుగము = యుగములు; త్రుంగెడు = అంత మగు; నాడు = సమయము నందు; జగములు = లోకములు; పొలియించు = నాశనము చేసెడి; అంతకుమూర్తి = హరుని, యముని {అంతకుమూర్తి - అంతకు (అంతము చేసెడి) మూర్తి (స్వరూపము), యముడు, హరుడు}; పైన్ = మీద; ఇంత = ఇంత పెద్ద; అగుచున్ = అగుచు; పఱపును = లావు; పొడువును = పొడుగు; ప్రతిదినము = దినదినమునకు; ఒక్క = ఒక శరపాతము = బాణముపడుదూరమంత; అంగంబు = దేహము; విరివిగొనుచున్ = పెద్దదగుచు; కడు = మిక్కిలి; దగ్ధ = కాలిబొగ్గయిన; శైల = కొండశిఖరము; సంకాశ = వంటి; దేహము = శరీరము; అందున్ = మీద; సంధ్యారాగ = సంధ్యారాగపు; కాంతి = ప్రకాశము; పెరయ = అతిశయించగా; మునున్ = ముందే; కాక = ఎఱ్ఱగాకాల్చిన; రాగి = రాగి; చే = చేత; కనుమించు = చూడ మిక్కిలి; మించులన్ = మెఱుపుతీగలవంటి; కఱుకు = బిరుసైన; మీసలు = మీసములు; కచ = వెంట్రుకల; అగ్రములు = చివర్లు; మెఱయన్ = మెరుస్తుండగా; చండ = భయంకరమైన;
మధ్యాహ్న = మధ్యాహ్నపు; మార్తాండ = సూర్యుని; మండల = మండలమువలె; ఉగ్ర = తీవ్రమైన; చటుల = భయంకరమైన; నిష్ఠుర = కఠినమైన; లోచన = కన్నుల; అంచల = అంచుల నుండి, కడ కన్నుల నుండి; విధూత = ఎగరగొట్టబడిన; దశదిశాభాగుండు = పది దిగ్భాగములు కలవాడు; ఉజ్జ్వలతర = మిక్కిలి ఉజ్జ్వలమైన {ఉజ్జ్వలము - ఉజ్జ్వలతరము - ఉజ్జ్వలతమము}; కరాళ = భయంకరమైన; భిదుర = వజ్రాయుధము వంటి; దంష్ట్ర = దంతములు గల; ఉరు = పెద్ద; వదన = నోరు యనెడి; గుహుడు = గుహ గలవాడు.

భావము:

ప్రళయకాలంలో లోకాలను నాశనం చేసే యమధర్మరాజు కంటే భయంకరమైన స్వరూపంతో, ప్రతిదినమూ ఒక్కొక్క కోలవేటు (బాణాన్ని ప్రయోగిస్తే అది పోయే దూరాన్ని కోలవేటు అంటారు) ప్రమాణంలో పొడుగు, వెడల్పు పెరిగే అవయవాలతో, చెట్లు గుట్టలు కాలిపోయిన కొండ వంటి ఎఱ్ఱని సంధ్యాకాంతులు వెలువడుతుండగా, ఎఱ్ఱగా కాల్చిన రాగిరేకుల వంటి కరుకైన మీసాలు శిరోజాలు మెరుస్తుండగా, మధ్యాహ్న కాలంలో భగభగ మండే సూర్యమండలం వలె భయంకరమైన కఠోరమైన చూపులతో పదిదిక్కులను బ్రద్దలు చేస్తూ ధగధగ మెరిసే వజ్రాయుధం వంటి పదునైన కోరలతో కూడిన గుహవంటి నోరుతో (వృత్రాసురుడు పుట్టాడు).