పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-314.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లిమీఁద గలుగు తాత్పర్యవశమున
దివిజవరుల మొఱఁగి తెచ్చి యిచ్చు
ది యెఱింగి యింద్రుఁ తిభీతచిత్తుఁడై
నకుఁగాని యతని లలు ద్రుంచె.

టీకా:

భూపాల = రాజా; ఆ = ఆ; విశ్వరూపున్ = విశ్వరూపుని; కు = కి; అరుదు = అద్భుతము; ఐన = అయిన; తలలు = శిరస్సులు; మూడున్ = మూడు (3); అనువొంద = అనుకూలముగ; కలిగి = ఉండి; ఉండున్ = ఉండును; సొరిదిన్ = వరుసగా; సుర = సుర; పాన = తాగుటకు; సోమ = సోమరసము; పానంబులున్ = తాగుటలు; అన్న = అన్నమును; ఆదమనన్ = తినుటకు; కను = కోసము; అమర = దేవతలలోని; వరుల = శ్రేష్ఠుల; తోన్ = తోటి; కూడి = కలిసి భుజియించి = తినుచు; తూకొని = పూని; వారి = వారి; తోన్ = తోటి; యజ్ఞ = యజ్ఞములలోని హవిస్ యందలి; భాగంబు = భాగమును; ప్రత్యక్షమున్ = ప్రత్యక్షముగ; ఒంది = పొంది; కైకొనుచుండి = స్వీకరించుతూ; దుష్ = చెడ్డ; కర్ముడు = పనులు చేయువాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; యజ్ఞ = యజ్ఞములలోని హవిస్ యందలి; భాగంబు = భాగములను; రాక్షస = రాక్షసులలో; ప్రవరుల్ = శ్రేష్ఠుల; కును = కు; తల్లి = తల్లి; మీద = పైన; కలుగు = ఉండెడి;
తాత్పర్య = వాత్సల్యము; వశమున = మూలమున; దివిజ = దేవతా; వరులన్ = శ్రేష్ఠుల; మొఱగి = కనుగప్పి; తెచ్చి = తీసుకొని వచ్చి; ఇచ్చున్ = ఇచ్చును; అది = దానిని; ఎఱింగి = తెలిసి; ఇంద్రుడు = ఇంద్రుడు; అతి = మిక్కిలి; భీత = భయపడుతున్న; చిత్తుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి; తన = తన; కున్ = కు; కాని = అంగీకారము కాని; అతని = అతని; తలలు = శిరస్సులను; త్రుంచె = ఖండించెను.

భావము:

మహారాజా! విశ్వరూపునికి మూడు తలలు. వానిలో మొదటి తల సురాపానం చేస్తుంది. రెండవది సోమపానం చేస్తుంది. మూడవది అన్నం భుజిస్తుంది. విశ్వరూపుడు దేవతలకు ఆచార్యుడై వారితో కలసి మెలసి ఉంటూ యజ్ఞాలు చేయిస్తూ వారితో పాటు హవిర్భాగాలు అందుకొంటూ ఉండేవాడు. కొంతకాలానికి అతని బుద్ధి వక్రించి ఒక చెడ్డపని చేశాడు. (విశ్వరూపుని తల్లి రచన. ఆమె రాక్షసుల ఆడపడుచు). అతడు యజ్ఞాలలోని హవిర్భాగాలను దేవతల కళ్ళు గప్పి మోసగించి తన తల్లి మీద గల అభిమానంతో ఆమెవైపు వారైన రాక్షసముఖ్యులకు రహస్యంగా ఇవ్వడం మొదలుపెట్టాడు. అది తెలిసికొని ఇంద్రుడు భయపడి తన శ్రేయోభిలాషి కాని విశ్వరూపుని మూడు తలలను ఖండించాడు.