పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-310-ఇం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంధించి నీ యంగక సంధులెల్లన్
బంధించి తన్మంత్రబలంబు పేర్మి
న్నందంబు మాన్పింపఁ దన్యమేదీ?
సింధుప్రవాహోన్నతిచేతఁ దీరున్.

టీకా:

సంధించి = కూర్చి; నీ = నీ యొక్క; అంగక = దేహము యొక్క; సంధులు = సంధులు; ఎల్లను = అన్నిటిని; బంధించి = బంధించి; తత్ = ఆ; మంత్ర = మంత్రము యొక్క; బలంబు = బలము; పేర్మిన్ = అతిశయము; అందంబున్ = కూడిక; మాన్పింపన్ = ఆపుటకు; తత్ = దానికి; అన్యము = ఇతరము; ఏది = ఏదికలదు; సింధు = సిందునది; ప్రవాహ = ప్రవాహజలము యొక్క; ఉన్నతి = గొప్పదనముచేత; తీరున్ = తీరును.

భావము:

నారాయణ కవచ ప్రభావం వల్ల నీ అవయవ సంధులు బంధింపబడ్డాయి. ఈ ఆపద తొలగటానికి ఒక మార్గం ఉంది. ఈ పుణ్యాత్ముని ఎముకలను నీవు నదీజలాలలో కలిపితే నీ కష్టాలు తీరిపోతాయి.