పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-306-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాటక మర్దించి పసి జన్నముఁ గాచి-
రువిల్లు విఱిచి ధైర్యమున మెఱసి
ప్రబలు లైనట్టి విరాధ కబంధోగ్ర-
రదూషణాది రాక్షసులఁ దునిమి
వానరవిభు నేలి వాలిఁ గూలఁగ నేసి-
లరాశి గర్వంబుఁ క్కజేసి
సేతువు బంధించి చేరి రావణ కుంభ-
ర్ణాది వీరులఁ డిమిఁ ద్రుంచి

6-306.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల విభీషణు లంకకు ధిపుఁ జేసి
భూమిసుతఁ గూడి సాకేత పురము నందు
రాజ్యసుఖములు గైకొన్న రామవిభుఁడు
రుస ననుఁ బ్రోచుచుండుఁ బ్రవాసగతుల.

టీకా:

తాటక = తాటకిని; మర్దించి = సంహరించి; తపసి = ఋషి యొక్క; జన్నము = యజ్ఞమును; కాచి = కాపాడి; హరు = శివుని; విల్లు = విల్లును; విఱిచి = విరిచి; ధైర్యమునన్ = ధైర్యముతో; మెఱసి = ప్రకాశించుతూ; ప్రబలులు = మిక్కిలి బలమైనవారు; ఐనట్టి = అయినటువంటి; విరాధ = విరధుడు; కబంధ = కబంధుడు; ఉగ్ర = భయంకరమైన; ఖర = ఖరుడు; దూషణ = దూషణుడు; ఆది = మొదలగు; రాక్షసులన్ = రాక్షసుల; దునిమి = సంహరించి; వానరవిభున్ = సుగ్రీవుని; ఏలి = పాలించి; వాలిన్ = వాలిని; కూలగ = సంహరించుటకు; ఏసి = బాణమువేసి; జలరాశి = సముద్రుని యొక్క; గర్వమున్ = గర్వమును; చక్కజేసి = అణచివేసి; సేతువు = సేతువును; బంధించి = కట్టి; చేరి = పూని; రావణ = రావణుడు; కుంభకర్ణ = కుంభకర్ణుడు; ఆది = మొదలగు; వీరులన్ = వీరులను; కడిమిన్ = పరాక్రమముతో; త్రుంచి = సంహరించి;
అల = ఆయొక్క; విభీషణున్ = విభీషణుని; లంక = లంకారాజ్యమున; కున్ = కు; అధిపున్ = రాజును; చేసి = చేసి; భూమిసుతన్ = సీతాదేవితో {భూమిసుత - భూదేవి యొక్క పుత్రిక, సీత}; కూడి = కలిసి; సాకేత = సాకేతము యనెడి; పురము = పట్టణము; అందు = లో; రాజ్యసుఖములు = రాజభోగములను; కైకొన్న = స్వీకరించిన; రామవిభుడు = శ్రీరామచంద్రుడు; వరుస = క్రమముగా; నను = నన్ను; ప్రోచుచుండు = కాపాడుతుండును; ప్రవాస = దూర ప్రాంతములకు; గతులన్ = పోవునపుడు.

భావము:

తాటకిని సంహరించి, విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడి, శివుని విల్లు విరిచి, ధైర్యవంతుడై బలాఢ్యులైన విరాధుడు, కబంధుడు, ఖరుడు, దూషణుడు మొదలైన రాక్షసులను చంపి, సుగ్రీవుని చేరదీసి, వాలిని నేలకూల్చి, సముద్రుని గర్వాన్ని అణచి, సేతువును బంధించి, రావణుడు కుంభకర్ణుడు మొదలైన రాక్షస వీరులను సంహరించి, విభీషణుని లంకకు రాజును చేసి, సీతతో కూడి అయోధ్యకు వచ్చి, సుఖంగా రాజ్యాన్ని పరిపాలించిన రాముడు దూరదేశాలలో నన్ను రక్షించును గాక!