పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-305-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాముఁడు రాజకులైక వి
రాముఁడు భృగు సత్కులాభిరాముఁడు సుగుణ
స్తోముఁడు నను రక్షించును
శ్రీహితోన్నతుఁడు నద్రి శిఖరములందున్.

టీకా:

రాముడు = పరశురాముడు; రాజకులైకవిరాముఁడు = పరశురాముడు {రాజ కులైక విరాముఁడు - రాజ (రాజుల) కుల (వంశమునకు) ఏక (సమస్తమును) విరాముడు (తొలగించువాడు), పరశురాముడు}; భృగుసత్కులాభిరాముఁడు = పరశురాముడు {భృగు సత్కు లాభిరాముఁడు - భృగు యొక్క సత్కుల (చక్కటి వంశమునకు) అభిరాముడు (మనోహరమైనవాడు), పరశురాముడు}; సుగుణస్తోముఁడు = పరశురాముడు {సుగుణ స్తోముడు - సుగుణముల సమూహము గలవాడు, పరశురాముడు}; నను = నన్ను; రక్షించును = కాపాడుగాక; శ్రీమహితోన్నతుఁడు = పరశురాముడు {శ్రీమహితోన్నతుడు - శ్రీ (శుభకరమైన) మహిత (గొప్ప) ఉన్నతుడు (ఉన్నతమైనవాడు), పరశురాముడు}; అద్రి = కొండ; శిఖరముల = శిఖరముల; అందున్ = అందు.

భావము:

క్షత్రియకుల వినాశకుడు, భృగువంశంలో ప్రసిద్ధుడు, సద్గుణుడు. గొప్ప మహిమాన్వితుడు అయిన పరశురాముడు పర్వత శిఖరాలలో నన్ను కాపాడుగాక!