పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-301-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రకట మకర వరుణ పాశంబు లందును
ములందు నెందుఁ బొలియ కుండఁ
గాచుఁగాక నన్ను నుఁడొక్కఁ డై నట్టి
త్స్యమూర్తి విద్యమానకీర్తి.

టీకా:

ప్రకట = ప్రసిద్ధమైన; మకర = మొసలి; వరుణ = వర్షపు; పాశంబులు = బంధనములు; అందు = అందు; జలములు = నీటి; అందు = అందును; ఎందున్ = దేనిలోను; పొలియకుండన్ = నాశము పొందకుండగ; కాచుగాక = కాపాడుగాక; నన్ను = నన్ను; ఘనుడు = గొప్పవాడు; ఒక్కడు = ఒకడే; ఐనట్టి = అయినట్టి; మత్స్యమూర్తి = మత్స్యవతార స్వరూపుడు; విద్యమాన = ప్రవర్తిస్తున్న; కీర్తి = యశస్సు గలవాడు.

భావము:

ప్రళయకాలంలో తానొక్కడే మిగిలి కీర్తితో ప్రకాశించే మత్స్యావతార మూర్తి అయిన మహానుభావుడు నన్ను వరుణ పాశాలలో పడకుండా జలాలలో రక్షించునుగాక!